పెళ్లి జరిగిన నెల రోజులకే భార్యతో విభేదాలు రావడంతో విడిపోయారు.

పెళ్లి జరిగిన నెల రోజులకే భార్యతో విభేదాలు రావడంతో విడిపోయారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రైల్వేస్టేషన్‌ యార్డు సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు స్టేషన్‌ డిప్యూటీ మేనేజర్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో నీలేశ్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా ఇటీవలే నీలేశ్‌కు వివాహం జరిగిందని, వ్యక్తిగత కారణాలతో నెల రోజుల కాపురం అనంతరం వారిద్దరు విడిపోయారని మృతుడి సోదరుడు ముఖేష్‌ పోలీసులకు వివరించాడు. అప్పటి నుంచి నీలేశ్‌ ముభావంగా ఉంటన్నాడని, అదే కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు నీలేష్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు.

ehatv

ehatv

Next Story