వరంగల్ జిల్లాలో(Warangal) డబుల్ మర్డర్(double murder) ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.

వరంగల్ జిల్లాలో(Warangal) డబుల్ మర్డర్(double murder) ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండ‌లం ప‌ద‌హారు చింత‌ తండాలో నిన్న అర్ధరాత్రి సమయంలో ఓ ప్ర‌మోన్మాది నానా హంగామా సృష్టించాడు. త‌న ప్రేయ‌సి కుటుంబంపై తల్వార్‌తో విరుచుకుపడి ఇరువురి ప్రాణాలు తీశాడు.

బానోతు శ్రీను, సుగుణ దంపతులకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. శీను కూతురును ప్రేమిస్తున్నానంటూ ఓ యువకుడు వెంటపడుతున్నాడు. అయితే అతఇ ప్రేమను ఆ యువతి తిర‌స్క‌రించింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు.. అర్ధరాత్రి సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులపై తల్వార్ తో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన శ్రీను భార్య సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా.. శీను హాస్పి టల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ దాడిలో శ్రీను కొడుకు, కూత‌రుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడు బన్నీని అదుపులోకి తీసుకుని.. అతడు ఉపయోగించిన తల్వార్ ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహా లను పోస్టుమార్టం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Eha Tv

Eha Tv

Next Story