ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ(Private finance organisation) నుంచి లోన్‌ తీసుకుని బైక్‌(Bike) కొన్నాడో యువకుడు.

ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ(Private finance organisation) నుంచి లోన్‌ తీసుకుని బైక్‌(Bike) కొన్నాడో యువకుడు. ప్రతి నెల ఈఎంఐ(EMI) కడుతూ వచ్చాడు. పాపం ఆర్ధిక సమస్యల కారణంగా ఈ నెల మాత్రం కట్టలేకపోయాడు. దాంతో ఆ ప్రైవేటు సంస్థ వేధింపులకు గురి చేసింది. వాటిని తట్టుకోలేక ఆ యువకుడు బైక్‌నే తగులబెట్టాడు. ఈ ఇన్సిడెంట్‌ మెదక్‌ జిల్లా శివంపేటలో జరిగింది. ఒక్క నెల ఈఎంఐ కట్టకపోయే సరికి ఆ యువకుడికి ఫైనాన్స్‌ సంస్థ ఏజెంట్ల నుంచి కాల్స్‌ రావడం మొదలయ్యాయి. కొంచెం సమయం ఇస్తే కట్టేస్తానని ఎంత చెప్పినా వారు వినలేదు. చివరకు ఆ యువకుడి ఇంటికి కూడా వచ్చారు. ఈఎంఐ కట్టాలని నానా గొడవ చేశారు. దాంతో మనోవేదనకు గురైన ఆ యువకుడు ఫైనాన్స్‌ సంస్థ ఏజెంట్ల ముందే బైక్‌కు నిప్పు పెట్టాడు. బైక్‌ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story