Different Proposing Idea : ప్రేయసికి వెరైటీగా లవ్ ప్రపోజల్.. ప్రేమికుడి ఐడియాకు ఫిదా
చాలా మంది ప్రేమిస్తారు .. కాకపోతే అవతలివారిపై ప్రేమను వ్యక్తపర్చడంలో విఫలమవుతుంటారు. ప్రపోజ్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటారు. ఇలాంటి వారి ప్రేమ మొగ్గలోనే తెగిపోతుంటుంది. కొందరే నచ్చిన అమ్మాయికో లేదా అబ్బాయికో లవ్‌ను చక్కగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. గ్రీటింగ్ కార్డులు, కానుకలు ఇవన్నీ పాతబడిన విద్యలు.. ప్రేమికులు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తుంటారు.

Different Proposing Idea
చాలా మంది ప్రేమిస్తారు .. కాకపోతే అవతలివారిపై ప్రేమను వ్యక్తపర్చడంలో విఫలమవుతుంటారు. ప్రపోజ్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటారు. ఇలాంటి వారి ప్రేమ మొగ్గలోనే తెగిపోతుంటుంది. కొందరే నచ్చిన అమ్మాయికో లేదా అబ్బాయికో లవ్‌ను చక్కగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. గ్రీటింగ్ కార్డులు, కానుకలు ఇవన్నీ పాతబడిన విద్యలు.. ప్రేమికులు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తుంటారు. వెరైటీల కోసం ట్రై చేస్తుంటారు. రీసెంట్‌గా ఓ యువకుడు తన ప్రేయసికి డిఫరెంట్‌గా ప్రపోజ్(Propose) చేశాడు. ఈ వెరైటీ ప్రపోజల్ నెటిజన్లకు కూడా బాగా నచ్చేసింది. ఇంతకీ అతడేం చేశాడంటే ప్రేయసి కోసం ప్రత్యేకంగా ఓ కీ బోర్డును(Keyboard) డిజైన్ చేసి ఆమెకు ప్రపోజ్ చేశాడు. బీ మై గర్ల్ ఫ్రెండ్ సెయాంగ్ ( Be my girlfriend Seyang ) అనే వాక్యం వచ్చేలా ఇంగ్లీష్ అక్షరాలతో కొన్ని బటన్స్‌ను అమర్చి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఈ వెరైటీ ప్రపోజల్‌కు ఆ అమ్మాయి అబ్బురపడింది. ఆనందపడింది. అతడి ప్రేమలో పడిపోయింది. నా బాయ్ ఫ్రెండ్ చాలా అద్భతమైన రీతిలో ప్రేమను తెలిపాడు అంటూ సంబరపడింది. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను అంటూ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింద. దాంతో వీరి ప్రేమకథ ఇప్పుడు వైరల్ అయ్యింది.
