Viral Video : పెద్ద పులితో సరసాలు ఆడిన అమ్మాయి.. చివరకు..
ప్రస్తుతం సోషల్ మీడియా(Social media) ఉపయోగించడం గురించి చెప్పక్కర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గంటలు గంటలు నెట్టింట మునిగితేలుతున్నారు. ఇక లైక్స్, కామెంట్స్, షేర్స్ కోసం వినూత్న ప్రయోగాలు చేయడమే కాదు.. ప్రాణాలకు తెగించి మరీ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. బైక్ రైడ్స్(Bike rides), కొండలపై నుంచి దూకేయడమే కాదు.. క్రూరమృగాలతో(Wild Animals) సయ్యాటలు ఆడుతుంటారు. అబ్బాయిలు కాదు.. అమ్మాయిలు ఇలాంటి ఆటలు ఆడుతుంటారు. ఇప్పటికే ఇలాంటి వీడియోస్ నెట్టింట కోకొల్లలు. యువత చాలా సార్లు భయంకరమైన జంతువుల ఆటపట్టించాలని ప్రయత్నిస్తారు.

Viral Video
ప్రస్తుతం సోషల్ మీడియా(Social media) ఉపయోగించడం గురించి చెప్పక్కర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గంటలు గంటలు నెట్టింట మునిగితేలుతున్నారు. ఇక లైక్స్, కామెంట్స్, షేర్స్ కోసం వినూత్న ప్రయోగాలు చేయడమే కాదు.. ప్రాణాలకు తెగించి మరీ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. బైక్ రైడ్స్(Bike rides), కొండలపై నుంచి దూకేయడమే కాదు.. క్రూరమృగాలతో(Wild Animals) సయ్యాటలు ఆడుతుంటారు. అబ్బాయిలు కాదు.. అమ్మాయిలు ఇలాంటి ఆటలు ఆడుతుంటారు. ఇప్పటికే ఇలాంటి వీడియోస్ నెట్టింట కోకొల్లలు. యువత చాలా సార్లు భయంకరమైన జంతువుల ఆటపట్టించాలని ప్రయత్నిస్తారు. క్రూరమృగాలతో ఆట ప్రమాదమని తెలిసినా లైక్స్ కోసం ఇలాంటి సాహాసాలు చేస్తారు. జంతువులు తమ యజమానులపై దాడి చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇందులో ఓ అమ్మాయి ఏకంగా పెద్ద పులితో సరసాలు ఆడిందండోయ్.. చివరకు దిమ్మతిరిగే షాకి ఇచ్చింది ఆ పులి.
ఆ వీడియోలో ఓ అమ్మాయి పెద్ద పులి దగ్గరికి వచ్చి దాని తలను నిమురుతూ.. కొడుతూ సరదాగా ఆడింది. అయితే అదే సమయంలో పులి మేల్కొని అమ్మాయి చేతిని నోటితో పట్టుకుంది. పులి నుంచి తన చేతిని వదిలించుకోవడానికి అమ్మాయి మిలియన్ సార్లు ప్రయత్నిస్తుంది. కానీ ఆ టైగర్ తన పట్టును మాత్రం వదులలేదు. ఇక చాలా సమయం పోరాడిన తర్వాత ఆ అమ్మాయి తన చేతిని నెమ్మదిగా విడిపించుకుంది. కానీ ఆ టైగర్ తర్వాత ఆ అమ్మాయి తొడను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఇక ఆ తర్వాత అమ్మాయి తన తొడను టైగర్ నుండి విడిపించుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. కానీ టైగర్ ఆమె నడుమును తన నోటిలోకి తీసుకుంటుంది. ఇలా చాలా సేపు ఆ అమ్మాయిని నోటితో పట్టుకోవడానికి తెగ ట్రై చేస్తుంది. కానీ ఆ అమ్మాయి భయపడుతూనే దానిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అయితే ఈ వీడియో చూసేందుకు భయంకరంగా ఉందని అంటున్నారు నెటిజన్స్. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
