ABN VenkataKrishna vs MLC Ravinder Rao: BRS ఎమ్మెల్సీని గెట్‌ ఔట్‌ అన్న ఏబీఎన్ 'వెంకట కృష్ణ'... అంత బలుపు అవసరమా అంటున్న BRS శ్రేణులు..!

గత రెండేళ్లుగా ఫోన్‌ ట్యాపింగ్‌ ఎపిసోడ్‌ నడుస్తూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్‌ కేసీఆరే చేపించారు, కేటీఆర్, హరీష్ రావు చేపించారు, వీళ్ళు హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారు, వీళ్ళు వ్యాపారవేత్తల ఫోన్లు టాప్ చేశారని ఏవేవో కథనాలు రాశారు. ఈ 2024 మార్చి నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ నడుస్తూనే ఉంది. ఇప్పటివరకు ఒక్క ప్రెస్ నోట్ కానీ, ప్రెస్ మీట్ కానీ పెట్టి ఏమీ చెప్పలేదు. ఫలానా వాళ్ళని విచారించాం, మాకు ఫలానా సమాచారం దొరికిందనో, లేకపోతే ఫలానా సమాచారం ఆధారంగా, ఫలానా వాళ్ళని పిలుస్తున్నామనో, ఎక్కడ అఫీషియల్‌గా ఎవరూ చెప్పలే, కానీ పేపర్లలో, టీవీల్లో మాత్రం అన్నీ అయిపోయాయి, ఇదీ అదీ అంటూ వార్తలు వండి వార్చారు. ఈ సందర్భంగా గత మూడు, నాలుగు రోజులుగా ఈ చర్చ మళ్లీ నడుస్తోంది. కేటీఆర్ ను నిన్న సిట్‌ విచారణకు పిలిచింది, అంతకుముందు హరీష్‌రావు పిలిచింది.

ఈ సందర్భంగా.. ఏబీఎన్‌ చానెల్‌లో జరిగిన డిబేట్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఒక కామెంట్ చేశారు. కామెంట్ చేయంగానే వెంకట కృష్ణ ' గెట్ అవుట్ ఫ్రమ్‌ మై డిబేట్', 'గెట్ అవుట్ మై డిబేట్' అని అరిచిండు. నువ్వేంది నన్ను గెట్ అవట్ అనేది నేనే క్విట్ అవుతున్నా అని ఆయన కూడా క్విట్ అయ్యి వెళ్లి పోయారు. అసలు ఏం జరిగిందంటే...

ఏబీఎన్‌లో జరిగిన చర్చలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు (అంటే ఏబీఎన్‌ వాళ్లు పిలిస్తేనే). ఈ సమయంలో సిట్‌ విచారణపై డిబేట్‌ జరిగింది. సిట్‌ ఎలాంటి లీకులు ఇవ్వలేదని డిబేట్‌లో వెంకటకృష్ణ చెప్పారు. దీంతో రవీందర్‌రావు, మరి ఈ 'పిచ్చి నా కొడుకులు ఎందుకు రాస్తున్నారు' అని అన్నారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వెంకటకృష్ణ కోరగా, రవీందర్‌రావు నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోను అంటే.. వెంకటకృష్ణకు ఆవేశం కట్టలు తెంచుకొని గెట్‌ ఔట్‌ ఆఫ్ మై షో, గెట్‌ ఔట్‌ ఆఫ్‌ మై డిబేట్‌ అని గట్టిగట్టిగా అరవడం, అవతలి నుంచి కూడా అంతే సమాధానం వచ్చింది. ఐ విల్‌ క్విట్‌ డిబేట్‌ అని చెప్పి రవీందర్‌రావు వెళ్లిపోయారు.

ఈ వివాదం తెలంగాణలో వివాదాస్పదంగా మారింది. బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు మండిపడుతున్నారు. ఓయూలో బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి పేపర్లను కాల్చివేశారు. మీ పత్రిక పేరును ఆంధ్రజ్యోతి కాదు.. చంద్రజ్యోతి అని పెట్టుకోవాలని మండిపడ్డారు. అసలు తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిని పట్టుకొని గెట్‌ఔట్‌ అనడానికి నువ్వెవరు అంటూ, నువ్వే తెలంగాణ నుంచి గెట్‌ ఔట్‌ అని బీఆర్‌ఎస్‌కు చెందిన శ్రేణులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలంగాణలో ఉంటూ, తెలంగాణ గాలి పీల్చుకుంటూ, తెలంగాణలో బతుకుతూ నీకు ఇంత అహంకారం ఎక్కడిది వెంకటకృష్ణ అని ప్రశ్నిస్తున్నారు. బిడ్డ వచ్చేది మా ప్రభుత్వమే, నువ్వు తెలంగాణలో ఎలా ఉంటామో మేం చూస్తామని హెచ్చరిస్తున్నారు. వెంకటకృష్ణ నీ బలుపు తగ్గించుకో అని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. నిఖార్సయిన తెలంగాణవాదులు మాత్రం ఈ చానెల్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు వెళ్తున్నారని, ABN చానెల్‌ను బాయ్‌కాట్‌ చేయాలని బీఆర్‌ఎస్ నేతలకు చెప్తున్నారు.

ప్రజాస్వామయంలో మీడియా ఉండాలే కానీ వీళ్ళు ప్రతిపక్షమే ఉండొద్దు అని కోరుకుంటున్నారు కదా, అట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు కదా అని చెప్తున్నారు. ఏబీఎన్‌, టీవీ5, మహాన్యూస్, ఈటీవీని జగన్‌ బ్యాన్‌ చేయలేదా, ఇక్కడ బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఆ చానెళ్లను ఎంటర్‌టైయిన్‌ చేస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. అసలు ఆ పదేళ్లలో ఈ చానెల్‌ను ఇక్కడి నుంచి తరిమేస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని బీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ఆ పార్టీకి మద్దతుగా నిలిచేవారు వాదిస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story