Anasuya and Chinmayi : సామాన్లు కనపడేలా బట్టలు వద్దు' కామెంట్స్‌పై శివాజీకి 'అనసూయ' కౌంటర్..!
‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఈ ఈవెంట్‌లో మాట్లాడిన శివాజీ, యాంకర్ డ్రెస్సింగ్ సెన్స్ బాగుందని ప్రశంసించారు. అయితే ఈ వ్యాఖ్యలను తాజాగా నటి, యాంకర్ అనసూయ యాంకర్ శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రత్యక్షంగా శివాజీని విమర్శించకపోయినా.. పరోక్షంగా మాత్రం ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ..‘ఇది నా శరీరం.. నీది కాదు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. స్త్రీలు బట్టలు వేసుకోవడంలో ఎవరి చాయిస్ వారిది. ఇది శివాజీకి కౌంటర్ లాగా ఉంది అంటూ కొంతమంది నెటిజెన్లు అనసూయకు మద్దతు తెలపగా.. మరికొంతమంది ఏమో శివాజీ మంచి సలహానే ఇచ్చారంటూ అనసూయని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఇక మరో నటి చిన్మయి శివాజీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. హీరోయిన్లకు అనవసరమైన సలహాలు ఇస్తూ సామాన్లను కప్పిపుచ్చుకోవడానికి చీరలు ధరించాలని 'దరిద్రపు ముండా' వంటి దూషణ పదాలను ఉపయోగించాడు. నటుడు శివాజీ ఒక అద్భుతమైన చిత్రంలో విలన్ పాత్ర పోషించాడు. చివరికి ఇన్సెల్ అబ్బాయిలకు హీరోగా మారాడు. ప్రొఫెషనల్ వేదికలపై 'దరిద్రపు ముండా' వంటి పదాలను ఉపయోగిస్తారా. మరి అలా అయితే శివాజీ జీన్స్, హూడీలు ఎందుకు వేసుకుంటాడు. అతను ధోతీలు మాత్రమే ధరించాలి. భారతీయ సంస్కృతిని అనుసరించాలి. బొట్టు ధరించాలి, అతను వివాహం చేసుకున్నాడని సూచించడానికి కంకణం, మెట్టెలు ధరించాలి. ఇక్కడ మహిళలను ఎలా చూస్తారో అన్‌బిలివబుల్ అంటూ చిన్మయి ట్వీట్ చేశారు.


