Anasuya-Shivaji Controversy: శివాజీ-అనసూయ మధ్యలో రాశి.. రాశికి అనసూయ క్షమాపణలు ఎందుకో తెలుసా..!
Anasuya-Shivaji Controversy: Rashi in the middle of Shivaji-Anasuya.. Do you know why Anasuya apologized to Rashi..!

దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కొందరు శివాజీకి మద్దతుగా నిలబడితే, మరికొందరు శివాజీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో శివాజీ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. తాను చెప్పాలనుకున్న ఉద్దేశం కరెక్టే కానీ, ఈ ప్రాసెస్‌లో రెండు పదాలు తప్పుగా దొర్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంలో తెలంగాణ మహిళా కమీషన్ నుంచి నోటీసులు రావడంతో ఆయన కమీషన్ ఎదుట హాజరై వివరణ కూడా. ముఖ్యంగా శివాజీ అనసూయ నుంచి అతి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయనకు వ్యతిరేకంగా పదే పదే ట్వీట్లు పెట్టడం చూశాం. ఈ నేపథ్యంలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ హీరోయిన్ రాశీ ఈ వివాదంపై స్పందించడంతో పాటు గతంలో తన గురించి చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్‌పై సీరియస్ అయ్యారు.
అయితే గత మూడు, నాలుగేళ్ల క్రితం అనసూయ యాంకరింగ్ చేసే ఓ షోలో ఆమె మాట్లాడిన మాటలను ఈ మధ్యే నటి రాశి ప్రస్తావించారు. శివాజీ గురించి ఏదో మాట్లాడుతున్నారు. శివాజీ మాట్లాడింది 100 శాతం తప్పని నేను అనను, కానీ కొన్ని పదాలను వాడటం మాత్రం కరెక్ట్ కాదు. ఆ పదాలను అనుకోకుండా ఉపయోగించానని శివాజీ కూడా బాధపడ్డారు. దానికి క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. వ్యక్తిగతంగా శివాజీ గురించి నాకు తెలుసు. శివాజీ గారి టాపిక్ కాదు కానీ, అనవసరంగా నా గురించి మాట్లాడిన ఓ విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అని రాశీ తెలిపారు.
నాలుగైదు ఏళ్ల క్రితం నా భర్త ఓ షోకి సంబంధించిన క్లిప్పింగ్ చూపించారు. ఆ షో మీ అందరికి తెలుసు.. రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటారు. ఆ షో జడ్జిలు కూడా మీకు తెలిసినవాళ్లే. అందులో నాకొక కాల్ అక్కడి నుంచి వచ్చింది. ఓ స్కిట్ చేయాలని అడగ్గా... కొన్ని ఎపిక్స్‌ని మనం టచ్ చేయకూడదని చెప్పా. సావిత్రమ్మ లెజండరీ.. అలాగే ప్రతి ఆర్టిస్ట్‌కి ఒక మూవీ ఉంటుంది. నాకు ప్రేయసిరావే మూవీ. చిన్నపిల్లలంతా నన్ను గుర్తుపడుతున్నారంటే దానికి కారణం ప్రేయసిరావే.
ఓ ఛానెల్‌లో ఓ స్కిట్ చేశారు. ఆ స్కిట్‌లో రాశీ ఫలాలు అనే పదం వాడారు. ఆ ఎపిసోడ్‌కి యాంకర్‌గా ఉన్నామె.. ఒక మహిళ అయ్యుండి రాశీగారి ఫలాలు గురించి మాట్లాడుతున్నావా? అని అడిగింది. అలా ఎలా అడుగుతుంది? నేను అది గమనించలేదు.. మైండ్‌కి తీసుకోలేదు. ఇప్పుడు ఆవిడ బాగా మాట్లాడుతున్నారు. రాశి ఫలాలు అనేది మామూలే. అది మనందరికీ తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను.. రాశి అనేది నా ఒరిజినల్ పేరు కాదు, నా పేరు విజయలక్ష్మీ. సినిమా పేరు తెలుగులో రాశి.. తమిళ్‌లో మంత్ర. రాశీ గారి ఫలాల గురించి చూస్తే.. గారిలో నేనున్నా. అంటే ఆమె నా గురించి మాట్లాడింది. అక్కడ జడ్జిలలో ఒక లేడీ ఉన్నారు.. ఆవిడ పడి పడి నవ్వింది. నేనైతే నవ్వేదానిని కాదు అని రాశీ అన్నారు.
నేను ఆ ప్లేస్‌లో ఉండుంటే.. స్కిట్ ఆపేసి ఎందుకు రాశీగారి ఫలాలు అనే పదాన్ని వాడుతున్నారు. అనవసరంగా ఎందుకు అని అడిగేదానిని. కామెడీ చేయొచ్చు.. కానీ బాడీ షేమింగ్ చేయడానికి కన్నతల్లికి, కన్నతండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు.. పిల్లల్ని మనం ఏమన్నా అంటే పిల్లలే కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాకు, టీవీకి నేను చాలా దూరంగా ఉంటాను అని చెబితే నమ్మరు. అందరూ హాయిగా ఉండండి, అనవసరంగా ఎందుకు ఈ గొడవలు. కెమెరా తీసుకుని సెల్ఫీలు, సెల్ఫ్ వీడియోలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాని ఒక మంచి ఫ్లాట్‌ఫాంగా ఉపయోగించండి, ఇలాంటి ఇష్యూత్‌తో సోషల్ మీడియాని బ్యాడ్ చేస్తున్నారని రాశీ సీరియస్ అయ్యారు.
అయితే ఈ విషయంపై యాంకర్ అనసూయ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు ఇందులో ''డియర్ రాశి గారు, మీకు నా హృదయపూర్వక క్షమాపణలు. మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో "తెలుగు సరిగ్గా రానితనం''పై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది, కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే.. ప్లీజ్ నా క్షమాపణలను అంగీకరించండి'' అంటూ ఆమె వేడుకున్నారు. దీంతో ఈ వివాదం ఇంతటితో ఆగిపోనుందా లేదా అనేది వేచి చూడాలి.


