✕
YS Jagan Portrait : రాగి ఆకుపై జగన్ చిత్రం..కళాకారుడి వినూత్న శుభాకాంక్షలు
By ehatvPublished on 21 Dec 2025 9:55 AM GMT
వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన కళాకారుడు శివకుమార్ తన ప్రతిభను చాటుకున్నారు.

x
వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన కళాకారుడు శివకుమార్ తన ప్రతిభను చాటుకున్నారు. అనంత్ సాగర్ గ్రామానికి చెందిన ఆయన, రాగి ఆకుపై వైఎస్ జగన్ చిత్రపటాన్ని అద్భుతంగా చెక్కి తన వినూత్న కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.జగన్‌కు ప్రత్యేకమైన శైలిలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ అరుదైన కళాఖండాన్ని రూపొందించినట్లు శివకుమార్ తెలిపారు. రాగి ఆకుపై సూక్ష్మంగా చెక్కిన ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించడంతో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.కళాకారుడి ఈ వినూత్న ప్రయత్నాన్ని పలువురు ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

ehatv
Next Story

