IPS officer Vasundhara Yadav!!: ''మేడం సార్.. మేడం అంతే..'' మేడారం జాతరలో మెరిసిన యువ ఐపీఎస్ వసుంధరయాదవ్..!!

ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకిపోయింది. సోషల్ మీడియా వల్ల దేశ విదేశాలలోని ప్రతి ఒక్కరికి తెలిసే జాతర అయింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియానే హల్చల్ చేసింది. అయితే 2026లో జరిగిన మేడారం జాతరలో ఓ మహిళ చాలా ఫేమస్ అయిది. ఆమెను చూసి ప్రతీ ఒక్కరు ''మేడం సార్.. మేడం అంతే'' అంటున్నారు.

మేడారం తొలి రోజు సారలమ్మ గద్దల పైకి వస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ లు కన్నేపల్లి ఆదివాసీలతో కలిసి నృత్యాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ఓ రూపం అందరినీ ఆకట్టుకుంది. ఎవరా అని ఆరా తీయగా.. ఆమె యువ ఐపీఎస్ ఆఫీసర్. కల్లూరు ఏసీపీగా పనిచేస్తున్నారు.

2023 బ్యాచ్ కు చెందిన వసుంధర యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అక్కడ విధులు నిర్వహిస్తూ 2024లో తెలంగాణకు బదిలీపై వచ్చారు. వసుంధర యాదవ్ ఆమె 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ యాదవ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈయన కూడా ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

వసుంధర యాదవ్‌ చురుకుదనం, విధినిర్వహణలో క్రమశిక్షణ, ఉత్సాహం చూసి నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా సాంప్రదాయ తీరుగా ఆమె చేసిన డ్యాన్స్ వల్ల ‘స్పెషల్‌ అట్రాక్షన్‌‘గా నిలిచి, మహిళా అధికారులకు ఆదర్శంగా మారారు.


https://www.instagram.com/p/DUKW-h4koDb/

Updated On
ehatv

ehatv

Next Story