BJP Leader Chikoti Praveen : హిందువులు లేకుంటే నీ బతుకు జీరో.. రాజమౌళిపై చీకోటి ప్రవీణ్ ఫైర్..!
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన సినిమా వారణాసి టైటిల్ గ్లింప్స్ ఈవెంట్‌లో హనుమంతుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన సినిమా వారణాసి టైటిల్ గ్లింప్స్ ఈవెంట్‌లో హనుమంతుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. ఈ ఈవెంట్‌లో టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.. హనుమంతుడిని తలచుకోవాలని సూచించడంపై రాజమౌళి స్పందన వివాదాస్పదమైంది. ''ఏంటి, ఇదేనా చేసేది?" అని ప్రతిస్పందించడం, తనకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పడం వంటి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయి. ఈ వివాదంపై బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ తీవ్రంగా స్పందించారు. "బిడ్డా రాజమౌళి, హిందూ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పు." హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు హిందువుల మనసులను దెబ్బతీశాయని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువులు నీ సినిమాలు చూడకపోతే నీ బతుకు ఏమవుతుందో ఆలోచించుకో. నువ్వు దేవుడిని నమ్మనప్పుడు నాస్తికులతో సినిమా ." హిందువుల మద్దతు లేకుండా రాజమౌళి కెరీర్ ఏమవుతుందో ఆలోచించుకోవాలన్నారు. "అహంకారంతో విర్రవీగే భల్లాలదేవ చివరకు ఎలా పతనమయ్యాడో నీ సినిమా బాహుబలిలోనే చూపించావు." రాజమౌళి తన సినిమాల్లోనే అహంకార పతనాన్ని చూపించాడని, అదే జరుగుతుందన్నారు. దేవుళ్లను నమ్మకుంటే, నాస్తిక కుక్కలతోనే సినిమాలు తీసుకోవాలని చీకోటి ప్రవీణ్ అన్నారు. హిందువులు సినిమా చూడకపోతే, నీ సినిమాలు ఎలా ఆడుతాయో తెలుసుకోమన్నారు. వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, నువ్వు హిందూ ద్రోహిగా నువ్వు మిగిలిపోతావు, హిందూ సమాజం తల్చుకుంటే నువ్వు హీరో నుంచి జీరో అవుతావని ఆయన అన్నారు.


