పెళ్లయ్యాక అప్పగింతల వేళ అక్కడి వాతావరణం ఉద్వేగ్నభరితంగా మారిపోతుంది.

అమ్మాయిని అత్తారింటికి(In laws) పంపేటప్పుడు తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనవుతారు. కన్నీరు పెడతారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు కూడా కన్నీరును బలవంతంగా ఆపుకుంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా అత్తారింటికి బయలుదేరక తప్పదు. అయితే ఇలా అత్తారింటికి పంపుతున్న దృశ్యాలతో కూడిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో(Social mdia) తెగ వైరల్‌ అవుతోంది. అందులో స్పెషాలిటీ ఏమిటంటే అత్తారింటికి వెళ్లనని పెళ్లికూతురు పెద్దపెట్టున ఏడ్వడం. వెళ్లనంటే వెళ్లనని కేకలు పెడుతుంటే సోదరుడు ఆ వధువును బలవంతంగా ఎత్తుకుని కారులో కూర్చోబెట్టాడు. ఆ సన్నివేశం చూసి బంధువులు, గ్రామస్తులు తెగ ఆశ్చర్యపోయారు. చాలా మంది నవ్వుకున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story