ప్రేమకు సరిహద్దులు ఉండవు. ప్రేమను దక్కించుకోవడానికి దూరభారాలను లెక్క చేయరు ప్రేమికులు. 29 ఏళ్ల క్రిస్టియన్‌ పరేడెస్‌(christian Paredes), 27 ఏళ్ల రిబ్కా క్లోటెన్‌ల(Rebekah Cloten) ప్రేమకథకు కాప్షన్ ఇదే! వీరి మధ్య దూరం పది వేల కిలోమీటర్లకు పైనే ఉంటుంది. అయినప్పటికీ తొలి చూపులోనే వారి మధ్య ప్రేమ మొదలయ్యింది. వారు కలుసుకున్న రోజుకు సరిగ్గా 11 రోజుల తర్వాత పెళ్లి(Marriage) చేసుకోవాలని డిసైడయ్యారు. ఈ ప్రేమకథలో హీరో క్రిస్టియన్‌ అర్జెంటీనా(Urgentina) నివాసి.

ప్రేమకు సరిహద్దులు ఉండవు. ప్రేమను దక్కించుకోవడానికి దూరభారాలను లెక్క చేయరు ప్రేమికులు. 29 ఏళ్ల క్రిస్టియన్‌ పరేడెస్‌(christian Paredes), 27 ఏళ్ల రిబ్కా క్లోటెన్‌ల(Rebekah Cloten) ప్రేమకథకు కాప్షన్ ఇదే! వీరి మధ్య దూరం పది వేల కిలోమీటర్లకు పైనే ఉంటుంది. అయినప్పటికీ తొలి చూపులోనే వారి మధ్య ప్రేమ మొదలయ్యింది. వారు కలుసుకున్న రోజుకు సరిగ్గా 11 రోజుల తర్వాత పెళ్లి(Marriage) చేసుకోవాలని డిసైడయ్యారు. ఈ ప్రేమకథలో హీరో క్రిస్టియన్‌ అర్జెంటీనా(Urgentina) నివాసి. హీరోయిన్‌ రిబ్కా క్లోటెన్‌ ఇంగ్లాడ్‌లోని డర్బిషైర్‌కు(Derbyshire) చెందిన యువతి. ఈ రెండు దేశాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. వీరిద్దరు ఎప్పుడూ కలుసుకోలేదు కానీ విధి వారిని దగ్గర చేసింది. మీరి మధ్య ప్రేమ 2022 అక్టోబర్‌లో సన్నగా మొదలయ్యింది. అప్పుడు ఒక నార్వేజియన్‌ క్రూజ్‌లో గిఫ్ట్‌ షాపు నడుపుతున్నాడు క్రిస్టియన్‌. అదే సమయంలో రిబ్కా తన సెలవులను ఈ క్రూజ్‌లోనే గడిపారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. నాలుగు రోజుల్లో రిబ్కా సెలవులు ముగిశాయి. క్రిస్టియన్‌, రిబ్కా ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. కొద్ది నెలల తర్వాత నార్వేజియన్‌ క్రూజ్‌ ఇంగ్లాండ్‌లోని సౌతాప్టన్‌లో ఆగింది. అప్పుడు మళ్లీ క్రిస్టియన్‌, రిబ్కాలు కలుసుకున్నారు. 11 రోజుల పాటు కలిసి ఉన్నారు. అప్పుడే మళ్లీ విడిపోకూడదని నిర్ణయించుకున్నారు. తాము ఒకరి కోసమే మరొకరు పుట్టామని ఇద్దరూ అనుకున్నారు. పెళ్లితో ఒక్కటి కావాలని డిసైడయ్యారు. వారి ప్రేమకు ఎన్నో ఆటంకలు ఎదురయ్యాయి. ఇద్దరి కుటుంబసభ్యులు పెళ్లికి ఏ మాత్రం ఇష్టపడలేదు. అతి కష్టం మీద వారిని ఒప్పించగలిగారు. తొలి చూపులోనే రిబ్కా నీలి కళ్లు తనను ఎంతగానో ఆకర్షించాయని, ఆమె నిజంగానే ఎంతో అందమైనదని క్రిస్టియన్‌ అన్నారు. 'నేను క్రూజ్‌లో ఉన్నప్పుడు ఆమెతో ఎంతో జాగ్రత్తగా మాట్లాడను. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తే నన్ను క్రూజ్‌ నుంచి బయటకు పంపించేస్తారు. ఆమె నా షాపు దగ్గరకు వచ్చినప్పుడు మేము మొబైల్‌ నంబర్లను ఇచ్చి పుచ్చుకున్నాం. కాల్స్‌ చేసుకోవడం, మెసేజ్‌లు పంపించుకోవడం మొదలు పెట్టాం. అలా మా పరిచయం పెరిగింది. 2023 జనవరిలో రిబ్కాకు ప్రపోజ్‌ చేశాను' అని క్రిస్టియన్‌ తెలిపారు. రిబ్కాతో పాటు ఉండేందుకు క్రిస్టియన్‌ బ్రిటన్‌కు షిఫ్ట్‌ కావాలనుకున్నాడు. ఇందుకోసం అతను ఏడు వేల మైళ్లు, అటే 11 వేల కిలోమీటర్లు ప్రయాణించి రిబ్కా ఉంటున్న నగరానికి చేరుకున్నాడు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు.

Updated On 22 July 2023 12:41 AM GMT
Ehatv

Ehatv

Next Story