AI Illegal Affair- AI tool reveals the truth: భార్య లేనప్పుడు కారులోకి మరో మహిళను తెచ్చిన భర్త.. AI టూల్ బయటపెట్టిన వాస్తవం..!
Husband brought another woman into the car when his wife was not there.. AI tool reveals the truth..!

సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో వైరలవుతోంది. తాను లేనప్పుడు తన భర్త వేరే మహిళను కారులోకి తీసుకొచ్చాడా అని కారులో ఉన్న AI టూల్‌ను భార్య అడుగుతుంది. దీనికి AI టూల్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా భార్య AI టూల్‌ను ప్రశ్నిస్తూ "నేను లేనప్పుడు నా భర్త కారులో వేరే మహిళలను తీసుకువచ్చాడా?" అని భార్య BYD వాయిస్ అసిస్టెంట్ జియావో ఫాంగ్‌ను అడుగుతుంది. దీంతో కారు నడుపుతున్న ఆమె భర్త తన భార్య వైపు చూస్తూ నవ్వుతాడు. కానీ లోలోపల భయం అయితే నెలకొంది. AI ఏం చెప్తుందా అనే ఆందోళన అయితే భర్తలో కనపడింది. ఇందుకు సమాధానంగా "మీ భర్త ఫాంగ్‌చెంగ్‌బావో వేరే స్త్రీని తీసుకువచ్చాడో లేదో నాకు నేరుగా తెలియదు" అని AI అసిస్టెంట్ సమాధానం ఇవ్వడంతో భర్త నవ్వుతూ బయటపడ్డాడు. ఇంతటితో AI ఆగలేదు, మరో ఆందోళనకరమైన విషయాన్ని వెల్లడించింది. "కానీ, నేను మీకు కొన్ని చిన్న చిట్కాలను ఇవ్వగలను. ముందుగా, కారు నావిగేషన్ హిస్టరీని చెక్ చేయండి. కాబట్టి, నావిగేషన్‌లో X స్టోర్ లేదా సెన్సిటివ్ లొకేషన్ ఉంటే అనుమాంచండి అంటూ ఒక టిప్ అందించింది. మరో టిప్ కూడా BYD వాయిస్ అసిస్టెంట్ అందించింది. కారు శుభ్రతను గమనించండి. మీ భర్త సాధారణంగా కారు శుభ్రపరచడం గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉండి, సడెన్‌గా కారు శుభ్రతపై ఆసక్తి కనబర్చితే ఇది ఏదో విపరీతమైన పరిణామంగా భావించండి అని తెలిపింది. అకస్మాత్తుగా కార్ వాష్ నిర్వహణపై ఆసక్తి చూపితే, కారు లోపల, వెలుపల చాలా జాగ్రత్తగా శుభ్రం చేస్తే, కారులో కాగితం లేదా వైప్స్, మినరల్ వాటర్, డియోడరెంట్ మొదలైన వాటిని కూడా ఉంచితే, సమస్య వచ్చే అవకాశం చాలా ఎక్కువ" అని జియావో ఫాంగ్ చెప్తుంది. "కానీ, ఏదైనా సరైన ఆధారాలు రాకముందే, ఆందోళన చెందకండి. మీ భర్తతో దీనిపై లోతైన చర్చ చేయాలి అని సూచించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. దీనికి నెటిజన్లు విభిన్న తరహాలో స్పందిస్తున్నారు.
https://www.instagram.com/p/DS-dTHHkh8r/


