నీ కొడుకు చెప్తే కూడా వినవా.. అనసూయపై నటుడు 'హర్షవర్దన్' కామెంట్స్
స్వేచ్ఛలో దుస్తులు భాగం.. దుస్తులే స్వేచ్ఛ కాదు..!

సినీ నటుడు హర్షవర్ధన్ కీలక కామెంట్స్ చేశాడు. గత కొన్ని రోజులుగా శివాజీ-అనసూయ కామెంట్స్‌పై హాట్‌హాట్‌గా డిస్కషన్ నడుస్తున్న సమయంలో ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. హర్షవర్దన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. స్వేచ్ఛలో దుస్తులు భాగం మాత్రమే కానీ దుస్తులు మాత్రమే స్వేచ్ఛ కాదన్నారు.
ఈ సందర్భంగా అనసూయ-శివాజీ టాపిక్ గురించి యాంకర్ ప్రశ్నించగా ఆయన స్పష్టమైన సమాధానం చెప్తూ ‘‘దొంగల మనసు మార్చే కన్నా.. ఇంటికి తాళం వేసుకోవడం ఉత్తమం. అది నా చేతిలో ఉన్న పని. నా ఇంట్లో వాళ్లకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం నాకు సులభం. అంతేకానీ, దొంగల్లారా ఆలోచించండి.. నేను లేని సమయంలో ఒంటరిగా ఉన్న నా వాళ్లపై దాడి చేయకండి అని దొంగలకు చెప్పడం కష్టం. గత కొన్ని రోజులుగా సాగుతోన్న అంశంపై ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతుంది. రెండు టాపిక్‌లను ఎప్పుడూ కలపకూడదు. స్వేచ్ఛ గురించి మాట్లాడితే దానిమీదే ఫోకస్ చేయాలి.. దుస్తుల గురించి అయితే వాటి గురించే మాట్లాడాలి. మంచి ఉద్దేశంతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాట్లాడేతీరు సరిగ్గా లేకపోతే వాళ్లు శివాజీ, అనసూయలు అవుతారు. శివాజీ మాట్లాడిన తీరు మాత్రమే తప్పు’’. ‘‘స్వేచ్ఛ అనే దానిలో చాలా రకాలు ఉంటాయి. చదువు, బంధాలు, మనకు కావాల్సిన ఆహారం తినడం, మనం చూడాలనుకున్న స్థలాలకు వెళ్లడం.. ఇవన్నీ స్వేచ్ఛలో భాగమే. ఇందులోనే మనకు కావాల్సినట్లు దుస్తులు వేసుకోవడం కూడా ఉంది. కేవలం మోడ్రన్ దుస్తులు ధరించడం మాత్రమే స్వేచ్ఛ కాదు. వాటి గురించి మాట్లాడే సమయంలో స్వేచ్ఛ అనే పదాన్ని వాడకూడదు. మనం ఉంటున్న ప్రదేశాన్ని బట్టి కూడా మన డ్రెస్సింగ్ ఆధారపడి ఉంటుంది’’ అని హర్షవర్ధన్ చెప్పారు. నా దుస్తులు నా ఇష్టమని అనసూయ చెప్తున్నారు. ఓకే కానీ తన కొడుకే, అమ్మా నీ డ్రెస్సింగ్ నాకు నచ్చడం లేదు, వద్దు అని చెప్తున్నాడని ఆమెనే చెప్తుంది. కానీ నా డ్రెస్ నా ఇష్టమని చెప్తుంది, కానీ బయట వాళ్లు చెప్తే వినవు, కానీ నీ కన్న కొడుకే చెప్తే కూడా వినవా అన్న కామెంట్స్‌ను మనం చూస్తున్నామని హర్ష ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీంతో ఆయనకు సబ్జెక్టుపై ఉన్నా క్లారిటీకి నెటిజిన్లు ప్రశంసలు అందిస్తున్నారు.


