I Bomma రవి అరెస్ట్.. నెటిజన్లు స్పందన ఏంటి..!
I Bomma Ravi's arrest.. What is the reaction of netizens..!

ఐ Bomma (ఐబొమ్మ) నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ విషయం సర్వత్రా హాట్ టాపిక్ అయిపోయింది. నవంబర్ 14న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే కూకట్‌పల్లిలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు పట్టుకున్నారు. ఈయన కరీబియన్ దీవుల్లో ఉంటూ iBomma, Bappam TV వంటి సైట్లు రన్ చేస్తూ తెలుగు సినిమాలు, OTT కంటెంట్ పైరసీ చేసి వేల కోట్లు సంపాదించాడని సమాచారం. పోలీసులు అతడి అకౌంట్‌లో రూ. 3 కోట్లు ఫ్రీజ్ చేశారు, సర్వర్లు యాక్సెస్ చేసి సైట్లు బ్లాక్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి రూ. 3 వేలు కోట్లు నష్టం కలిగించినట్టు అంచనా. దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు సవాల్ విసరడంతో తెలంగాణ పోలీసులు దీనిని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు.
ఐ బొమ్మ రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో విదేశాలలో ఉన్న ఈయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు స్వయంగా సమాచారాన్ని రవి భార్య అందవేసినట్టు తెలుస్తుంది. దీంతో పోలీసులు రవి కదలికలపై నిఘా పెట్టి పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారని తెలుస్తోంది.
హీరోలకు వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్లు ఇస్తున్నారు. విలాసవంతమైన ట్రిప్పులు నిర్వహించి వాటి భారాన్ని సామన్యులపై వేస్తారా అని ఐ బొమ్మ గతంలో పోస్ట్ చేసింది. సినీ ఇండస్ట్రీ నష్టాలకు కారణం మేం కానే కాదు.. నిర్మాతలు, హీరోలే దీనికి కారణం. సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం హీరోల రెమ్యునరేషన్లకే వెళ్లిపోతుంది. విదేశాల్లో షూటింగుల పేరుతో బడ్జెట్‌ని విపరీతంగా పెంచేస్తున్నారు. అదే ఇండియాలో షూటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది. అనవసర ఖర్చు పెట్టేసి దాని రికవరీ కోసం ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు. చావుకి భయపడని వాడు దేనికీ భయపడడు. మేం ఎక్కడున్నా భారతీయుల కోసం మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ల కోసం పనిచేస్తూనే ఉంటాం" అంటూ ఐబొమ్మ పోస్ట్ పెట్టింది. టికెట్ల రేట్లు గణనీయంగా పెంచి, పేదవాడిపై అదనపు భారం వేస్తున్నారని ఐబొమ్మ పోస్ట్ చేసింది.
చాలా మంది నెటిజన్లు రవి పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు! పైరసీ చేయటం తప్పు అంగీకరిస్తున్నాం కానీ కామన్ మ్యాన్‌కి సినిమా టికెట్ల ధరలు పెంచి భారం వేస్తున్నారని, దీనికి ఐబొమ్మ ప్రత్యామ్నాయంలా కనపడిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా చాలా మీమ్స్ కూడా రవిపై వస్తున్నాయి. ''పోలీసులు రవిని అరెస్ట్ చేసిన సందర్భంగా, ఇద్దరు పోలీసులు సంభాషణ ఇలా జరిగింది. రవిని కొట్టాలంటూ ఓ పోలీస్ తోటి పోలీసుకు చెప్తే.. లేదు సార్.. నేను కూడా ఐ బొమ్మలో రోజూ సినిమాలు, సిరీస్‌లు చూస్తా, తనను కొట్టబుద్ధికావడం లేదని ఆ పోలీస్ చెప్పడం గమనార్హం.


