Romance Survey : ఆఫీసు రొమాన్స్‌లో రెండో స్థానంలో భారత్..! ఇంట్లో ఇల్లాలు.. ఆఫీసులో ప్రియురాలు..!
ఆఫీసులో ప్రేమలు సర్వసాధారణం, కానీ భారతదేశంలో అవి ముఖ్యంగా ప్రబలంగా కనిపిస్తున్నాయి.

ఆఫీసులో ప్రేమలు సర్వసాధారణం, కానీ భారతదేశంలో అవి ముఖ్యంగా ప్రబలంగా కనిపిస్తున్నాయి. వివేకవంతమైన సంబంధాలకు వేదిక అయిన ఆష్లే మాడిసన్ ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం, ఆఫీసులో ప్రేమలో ఉన్నట్లు, అంగీకరించే వ్యక్తుల విషయానికి వస్తే భారతదేశం రెండో స్థానంలో స్థానంలో ఉంది. ఆ సర్వే ప్రకారం ఆఫీసు రొమాన్స్‌లో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఒక డేటింగ్ ప్లాట్‌ఫాం, YouGov చేసిన గ్లోబల్ స్టడీ నుంచి వచ్చిన డేటా ప్రకారం 11 దేశాల్లో 13,581 మందిని సర్వే చేసి, ఆఫీస్ కోలీగ్‌తో రొమాన్స్ జరిగినట్టు లేదా జరుగుతుందా అని ప్రశ్నించారు. ఇందులో మెక్సికో టాప్ పొజిషన్‌లో ఉంది. మెక్సికోలో 43% మంది ఆఫీస్ రొమాన్స్ నడిపిస్తున్నామని చెప్పారు. భారత్‌లో 40శాతం మంది అంటే 10 మందిలో 4 మందిలో ఒకరు కోలీగ్‌తో డేట్ చేశారు లేదా చేస్తున్నారు. ఇది అమెరికా, లండన్, కెనడా కంటే ఎక్కువగా ఉంది. మగవాళ్లు 51 శాతం అంటూ చెప్పగా, స్త్రీలు 36 శాతం ఉన్నారు. యంగ్ ప్రొఫెషనల్స్ 18-24 ఏళ్ల వాళ్లు 34 శాతం మంది కెరీర్ ప్రభావం భయంతో ఇలా చేస్తున్నారని తేలింది. ఆఫీస్‌లో ఎక్కువ సమయం గడపడం, టీమ్ వర్క్, కాఫీ బ్రేక్స్ వల్ల కనెక్షన్స్ పెరిగాయన్నారు. ఇండియాలో మారుతున్న కల్చర్, ఓపెన్ మ్యారేజెస్, నాన్-ట్రెడిషనల్ రిలేషన్‌షిప్స్ పెరుగుతున్నాయి. మెక్సికో 43%, భారత్ 40%, అమెరికా, లండన్ కెనాడలో 30 శాతం మంది చొప్పున రొమాన్స్‌లో మునిగిపోతున్నట్లు వెల్లడించారు. ఆఫీస్‌లో 8-10 గంటలు గడపడం, వర్క్ ప్రెషర్ షేర్ చేసుకోవడం వల్ల ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుందంటున్నారు. మారుతున్న కల్చర్ కూడా ఒక కారణమని భావిస్తున్నారు. ఇది మెట్రో నగరాలైన హైదరాబాద్, బెంగళూరులో ఎక్కువగా ఉన్నా.. తమిళనాడులోని కంచీపురంలాంటి చిన్న నగరాల్లో కూడా పెరుగుతోంది. వివాహేతర సంబంధాలపై ఆసక్తి విషయంలో భారతదేశంలో అత్యధిక స్థానంలో కాంచీపురం అగ్రభాగాన ఉంది
ఈ అధ్యయనం ప్రకారం ప్రతి పదిమందిలో నలుగురు భారతీయులు సహోద్యోగితో డేటింగ్ చేస్తున్నారు. దీన్నిబట్టి పని ప్రదేశాలలో ప్రేమాయణాలు కామన్ అయిపోయాయని అర్థమవుతోంది. నిజానికి ఆఫీసుల్లో వృత్తిపరమైన సరిహద్దులు, ప్రవర్తన వంటి వాటికీ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వాటన్నింటిని దాటుకొని మరీ ఆఫీస్ రొమాన్స్ విపరీతంగా పెరిగిపోయింది. ఇందులో ఆశ్చర్యం లేదు ఎందుకంటే ప్రతిరోజూ 70% సమయం సహోద్యోగులతో గడుపుతారు, కుటుంబ, వ్యక్తిగత విషయాలను అతడు లేదా ఆమెతో పంచుకుంటారు. దీంతో వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి సంబంధాలు కలుపుకుంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.


