జానూ లిరి అసలు పేరు జిమ్మిడి ఝాన్సీ, తెలంగాణ(telangana)లోని కరీంనగర్‌(karimnagar)కు చెందిన ప్రముఖ ఫోక్ డాన్సర్, జానపద గాయని, సోషల్ మీడియా స్టార్.

జానూ లిరి అసలు పేరు జిమ్మిడి ఝాన్సీ, తెలంగాణ(telangana)లోని కరీంనగర్‌(karimnagar)కు చెందిన ప్రముఖ ఫోక్ డాన్సర్, జానపద గాయని, సోషల్ మీడియా స్టార్. ఆమె తన ఎనర్జిటిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్‌లు, సాంప్రదాయ జానపద గీతాలతో తెలంగాణలో బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియా ఫేమ్, జానూ లిరి(Janu lyri) తన సాంప్రదాయ దుస్తులు, తెలంగాణ ఫోక్ డాన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆమె ఫోక్ సింగర్ మంగ్లీ(mangli)తో కలిసి "కనకవ్వ ఆడ నీమలి" అనే పాటలో డాన్స్ చేశారు, ఈ పాట యూట్యూబ్‌లో 15 కోట్ల వ్యూస్ సాధించింది. "అందాల సుందరాంగుడు" వంటి లేటెస్ట్ ఫోక్ సాంగ్స్‌లో కూడా ఆమె కొరియోగ్రఫీ, డాన్స్ చేశారు. ప్రముఖ ఢీ షో(Dhee Show) విజేతగా కూడా జానూ లిరి నిలిచింది. జానూ లిరి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పలు కమర్షియల్ బ్రాండ్స్‌ను ప్రమోట్‌ చేసింది. దీనివల్ల ఆమె బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది. జానూ లిరి టోనీ కిక్‌ను వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే, వారు ఇటీవల విడాకులు తీసుకున్నారు. జానూ లిరి రెండో పెళ్లి గురించి వచ్చిన వార్తలపై స్పష్టత ఇస్తూ ఓ వీడియో పోస్టు చేసింది. తన వ్యక్తి జీవితం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అన్నతో మాట్లాడినా, తమ్ముడితో మాట్లాడినా అక్రమ సంబంధం అంటగడుతున్నారని ఏడుస్తూ వీడియో చేసింది. తన రీల్స్‌లో ఇష్టారీతిన కామెంట్స్‌ పెడుతున్నారని, ఇంక తనకు ఓపిక నశించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఒక కొడుకు ఉన్నాడని ఇలాంటివి చూస్తే తన కొడుకు ఏమైపోతాడని.. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.



ehatv

ehatv

Next Story