KCR–Revanth Reddy Shake Hands : అసెంబ్లీలో KCR-రేవంత్ కరచాలనం.. ట్రోల్స్‌పై KTR సంచలన ట్వీట్..!
అసెంబ్లీలో నిన్న జరిగిన పరిణామాలపై అటు అన్ని మీడియాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

అసెంబ్లీలో నిన్న జరిగిన పరిణామాలపై అటు అన్ని మీడియాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ సీటు వద్దకు వెళ్లి కరచాలనం చేయడం, ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు సభలో ఇలా కలవడం అనూహ్యంగా మారింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో పాటు, రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించాయి. రేవంత్ రెడ్డి చేసిన షేక్ హ్యాండ్‌పై వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల రాష్ట్ర ప్రజలందరికీ గౌరవం ఉంది. సభలో కేసీఆర్‌ని కలిసేంత సంస్కారం సీఎంకు ఉంటే చాలు. కానీ అదే సంస్కారం బయట మాటల్లోనూ కనిపిస్తే ఇంకా బాగుంటుంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా వచ్చి కేసీఆర్‌ను కలిసిన సమయంలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలంతా లేచి నిల్చున్నారు. ఒక్క కేటీఆర్, కౌశిక్‌రెడ్డి మాత్రం మౌనంగా చూస్తూ కూర్చున్నారు. ముఖ్యమంత్రి వచ్చినా కేటీఆర్ కనీస మర్యాద పాటించలేదంటూ, కేటీఆర్‌కు ఎంత అహంకారమంటూ రేవంత్ అనుకూల సోషల్ మీడియా ఫాలోవర్స్ అయితే కానీ, ఇతర ప్రసార మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. కేటీఆర్‌కు ఎందుకింత అహంకారమంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తన ఇన్‌స్టా, ఎక్స్ వేదికగా స్పందించారు. ''గౌరవం సంపాదించబడుతుంది.. మరియు ఆత్మగౌరవాన్ని రాజీ పడనివ్వలేము''.. ''I Dont Treat People badly, I treat them accordingly'' (నేను ఎవరితో చెడుగా ప్రవర్తించను, వారి ప్రవర్తన ప్రకారమే నడుచుకుంటాను) అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఎక్కడా తగ్గకూడదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


