Love blossoms: ఇలాంటి ప్రేమ ఎక్కడా చూడలేదేమో..! పెళ్లి కోసం 15 రోజుల అత్యవసర పెరోలు మంజూరు

రాజస్థాన్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీల ప్రేమ కథకు హైకోర్టు అనుమతి లభించింది. పెళ్లి చేసుకునేందుకు రాజస్థాన్ హైకోర్టు వారికి 15 రోజుల అత్యవసర పెరోలు మంజూరు చేసింది. అల్వార్‌లో ఈరోజు ఆ జంట వివాహం చేసుకోనుంది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తి హత్య కేసులో ప్రియాసేథ్ దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తోంది.వరుడు హనుమాన్ ప్రసాద్ ఐదుగురిని హత్య చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ. ఒకే జైలులో ఉన్న సమయంలో ఆరు నెలల క్రితం వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెళ్లికి అనుమతి ఇవ్వాలని ఇద్దరూ కోర్టును ఆశ్రయించగా, ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అత్యవసర పెరోలు మంజూరు చేసింది. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Updated On
ehatv

ehatv

Next Story