ఇప్పుడు పెళ్లిళ్లు మరీ కాస్లీ అయ్యాయి. హంగు ఆర్భాటాలను ప్రదర్శించుకోవడానికి పెళ్లిని ఉపయోగించుకుంటున్నారు కొందరు. కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయిదారు రోజులపాటు పెళ్లి వేడుకలను జరిపిస్తున్నారు. ఇక భోజనాల సంగతి చెప్పనే అక్కర్లేదు. రాజుల కాలంలో కూడా ఇంత ఆడంబరంగా పెళ్లిళ్లు (Lavish Wedding) జరిగేవి కావేమో! లేడి డయానా (lady diana) , ప్రిన్స్‌ ఛార్లెస్‌ (prince charles)ల వివాహవైభవాన్ని చూసి అప్పట్లో అబ్బురపడ్డాం కానీ, ఇప్పుడు డబ్బున్న ప్రతి ఒక్కరు అంతే భారీగా పెళ్లి వేడుకలను జరుపుతున్నారు. ఇటీవల సౌత్‌ ఫ్లోరిడా (south florida)కు చెందిన ఒకాయన తన కూతురు పెళ్లిని చాలా గ్రాండ్‌గా జరిపించారు.

ఇప్పుడు పెళ్లిళ్లు మరీ కాస్లీ అయ్యాయి. హంగు ఆర్భాటాలను ప్రదర్శించుకోవడానికి పెళ్లిని ఉపయోగించుకుంటున్నారు కొందరు. కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయిదారు రోజులపాటు పెళ్లి వేడుకలను జరిపిస్తున్నారు. ఇక భోజనాల సంగతి చెప్పనే అక్కర్లేదు. రాజుల కాలంలో కూడా ఇంత ఆడంబరంగా పెళ్లిళ్లు (Lavish Wedding) జరిగేవి కావేమో! లేడి డయానా (lady diana) , ప్రిన్స్‌ ఛార్లెస్‌ (prince charles)ల వివాహవైభవాన్ని చూసి అప్పట్లో అబ్బురపడ్డాం కానీ, ఇప్పుడు డబ్బున్న ప్రతి ఒక్కరు అంతే భారీగా పెళ్లి వేడుకలను జరుపుతున్నారు. ఇటీవల సౌత్‌ ఫ్లోరిడా (south florida)కు చెందిన ఒకాయన తన కూతురు పెళ్లిని చాలా గ్రాండ్‌గా జరిపించారు. వందల కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చుపెట్టాడు. కార్‌ డీలర్‌షిప్‌(Car Dealership) అయిన ఆయన తన కూతురు మడేలైన్‌ బ్రాక్‌వే (madelaine brockway) పెళ్లి అయిదు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా చేశాడు. దీనికి అయిన ఖర్చు 59 మిలియన్‌ డాలర్లు. అంటే ఇంచుమించు 500 కోట్ల రూపాయలు. 26 ఏళ్ల మడేలైన్ బ్రాక్‌వే తను ప్రేమించిన జాకబ్‌ లాగ్రోన్‌ (Jacob LaGrone )నే పెళ్లి చేసుకుంది. అయిదు రోజుల పాటు జరిగిన పెళ్లి తంతునంతా డ్యాకుమెంటరీగా తీసింది. కచేరీ ప్రారంభం నుంచి వేర్సైల్లెస్ ప్యాలెస్‌(Palace of Versailles)లో రాత్రిపూట బస చేసే వరకు అన్నింటినీ చిత్రీకరించింది. ఇందులోని కొన్ని దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పలైస్ గార్నియర్‌లో రిహార్సల్ డిన్నర్, వెర్సైల్లెస్ ప్యాలెస్‌(Palace of Versailles)లో రాత్రిపూట బస, ప్రైవేట్ లంచ్, ఉటాలోని ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్‌లో బ్యాచిలొరెట్ వీక్ (bachelorette week).. ఇలా అన్నింటిని వీడియో తీశారు. అయితే పెళ్లి ఎక్కడ జరిగిందనేది మాత్రం ఎక్కడా మెన్షన్‌ చేయలేదు. కాకపోతే ప్యారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ (Eiffel Tower)గార్డెన్‌లో వేడుకలు పెద్ద ఎత్తున జరిగినట్టు కొందరు అనుకుంటున్నారు. అదే ప్రాంతంలో పెళ్లి కూడా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మూడేళ్ల కిందట వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు. పెళ్లికి కొన్ని రోజుల ముందే వీరు తమ ఫ్రెండ్స్‌తో కలిసి ప్యారిస్‌కు వెళ్లారు. వీరు బస చేసిన హోటల్‌ గదుల కోసం రోజుకు 2400 డాలర్లు వెచ్చించారు. గతంలో కర్ణాటకకు చెందిన గాలి జనార్దన్‌రెడ్డి కూడా తన కూతురు పెళ్లికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అంటుంటారు.

Updated On 1 Dec 2023 7:12 AM GMT
Ehatv

Ehatv

Next Story