మాధురి బర్త్‌డే సందర్బంగా జరిగిన హడావిడి, పోలీసుల సెర్చింగ్‌పై మాధురితో కలిసి దువ్వాడ ఓ వీడియో విడుదల చేశారు.

మాధురి బర్త్‌డే సందర్బంగా జరిగిన హడావిడి, పోలీసుల సెర్చింగ్‌పై మాధురితో కలిసి దువ్వాడ ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'' ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, నిన్న నిన్న జరిగినటువంటి ఒక రియల్ ఎస్టేట్ టీం అందరం కూర్చొని రియల్ ఎస్టేట్ విస్తరణ కోసం మాట్లాడే దానిలో జరిగినటువంటి సమావేశం. ఆ సమావేశంలో పార్దు అనే ఒక రియాల్టర్ ఇదంతా ఆర్గనైజ్ చేశారు. కానీ ఆయనకి తెలీదు ఆ ఫార్మ్ హౌస్ వాళ్ళే లైసెన్స్ తీసుకున్నారు, పర్మిషన్స్ తీసుకున్నారు అని చెప్పారు వాళ్ళు, ఆయన అది క్యాజువల్ గా తీసేసుకున్నాడు. మరి కార్యక్రమాన్ని ప్రారంబించిన తర్వాత పోలీసులు 10 గంటలకు అలా వచ్చారు. మేము 9:30 కి అక్కడికి వెళ్ళాం వాళ్ళు రావటం, అక్కడ చెక్ చేయటం , బాటిల్స్ ఉన్నాయని, లిక్కర్ బాటిల్స్ ఫారిన్ ఉన్నాయని, అని వాళ్ళు అడగటం, అవన్నీ కూడా చెక్ చేసుకోవటం, తర్వాత నన్ను కూడా వాళ్ళు చూసి సార్ మీరు ఇక్కడే ఉన్నారా, ఇక్కడ లైసెన్స్ లేదు, పర్మిషన్ లేకుండా ఇది జరుగుతుంది కాబట్టి మేము రావడం జరిగింది, ఇవన్నీ సీజ్‌ చేస్తున్నామండి అన్నారు. దట్స్ ఆల్. చాలా మంది పుట్టిన రోజు అక్కడ జరిపామని, డిసెంబర్ 11 మాధురి పుట్టిన రోజు కాదు, డిసెంబర్ 12 మాదరి పుట్టిన రోజు, ఇదిగో ఇప్పుడు పుట్టిన రోజు జరుపుకున్నాం. ఈ సందర్భంగానే మరి అందరికీ కూడా ఒకసారి మీ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి, రెండు రాష్ట్రాల్లో తెలుగు వారికి, దేశ విదేశాల్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అది ఆ లైసెన్స్ లేదన్న విషయం తెలియక మేము వెళ్ళటం జరిగింది. ఉందనే అనుకున్నాము, లేదు అని తెలిస్తే వెళ్లి ఉండే వాళ్ళమే కాదు. కాబట్టి దయచేసి దీన్ని ఎక్కువ ఎక్స్టెండ్ చేయకుండా ఈ జరిగిన విషయం పైన పోలీసు వారు కూడా కేసు పెట్టారు. ఫార్మ్ హౌస్ యజమాని పైన, పార్థు పైన. సో ఎటువంటి అరెస్టులు జరగలేదు, ఇదంతా అబద్ధం, అభూత కల్పన అని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తూ, ప్రజల కోసం నిత్యం పని చేసే వ్యక్తులుగా క్రమశిక్షణతో ఎలా ముందుకు అడుగేయాలని దానిలో మేము ముందు ఉంటామని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి ఆశిస్సులు సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం'' అని విడియో విడుదల చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story