బీహార్‌(Bihar )కు చెందిన ఓ మహిళకు వివాహం జరిగి, ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు.

బీహార్‌(Bihar )కు చెందిన ఓ మహిళకు వివాహం జరిగి, ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ఇన్నాళ్లూ భర్త, పిల్లలతో హాయిగా ఉన్న ఆమెకు.. తన అన్న భార్య (వదిన) చెల్లెలితో స్నేహం ఏర్పడింది. మరదలు చాలా చిన్నది కాగా.. ఎప్పుడూ వదినతోనే ఉండేది. వీరిద్దరి మధ్య బంధం బలపడింది. ఆ బలం కాస్త ప్రేమగా మారింది. ఆడవాళ్లే అయినప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ బాలిక కోసం మహిళ భర్త, ముగ్గురు పిల్లలను కూడా వదిలేసి లేచిపోయి రహస్యంగా పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అంతా షాక్ అయ్యారు. ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్‌లోని దర్బంగా జిల్లా కుషెష్వర్‌స్థాన్‌(Kusheshwarsthan)కు చెందిన క్రితికి 11 ఏళ్ల క్రితమే కృష్ణ మాంఝీ(Krishna Manjhi)తో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే చాలా కాలం వీరి కాపురం సవ్యంగా సాగింది. ఇటీవలే క్రితికి.. తన అన్న భార్య చిన్న చెల్లెలితో స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. గత రండేళ్లుగా ఆ మైనర్ బాలిక, క్రితిలు చాటుమాటుగా ప్రేమాయణం కొన సాగిస్తున్నారు. ప్రతిరోజూ గంటల తరబడి ఫోన్లు మాట్లాడేవారు. అయితే ఇద్దరూ ఆడవాళ్లే కావడంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. కానీ క్రితి భర్త కృష్ణకు మాత్రం ఆమె తరచుగా ఫోన్ మాట్లాడడం నచ్చలేదు, ఇదే విషయంపై పలు సార్లు భార్యను మందలించాడు. దీంతో క్రితి మైనర్ మరదలితో.. తనకున్న సంబంధం గురించి చెప్పేసింది. తామిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నట్లు వివరించింది. దీంతో భర్త షాకయ్యాడు. మనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, నువ్విప్పుడు ఇలా చేయడం సరికాదని తెలిపాడు. మరదలి వయసు తమ కుమార్తెల వయసుకు చాలా దగ్గరగా ఉంటుందని.. ఇదంతా తప్పని వివరించాడు. కానీ క్రితి మాత్రం భర్త మాటలను కొట్టి పారేసింది. వద్దని చెప్తే.. మిమ్మల్ని వదలేసి వెళ్లిపోతానంటూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో భర్త కూడా ఆమె తరచుగా ఫోన్లు మాట్లాడినా ఏమీ చేయలేకపోయాడు.

ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 6వ తేదీన క్రిత తన మైనర్ మరదలిని తీసుకుని రాజస్థాన్‌( Rajasthan)కు పారిపోయింది. అక్కడే వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. 20 రోజుల పాటు వారిద్దరూ అక్కడే హాయిగా గడిపారు. కానీ ఎక్కువ కాలం అక్కడే ఉండలేమని అర్థం చేసుకుని ఈనెల 26వ తేదీన ఇంటికి తిరిగి వచ్చారు. మరోవైపు మైనర్ బాలిక కనిపించకుండా పోయిన వెంటనే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు కూడా వీరిద్దరి కోసం గాలించారు. ఈనెల 26వ తేదీన గ్రామంలోకి వచ్చి వెంటనే మహిళ సహా ఆమె భర్త, మరదలిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మైనర్ బాలికను వారికి అప్పగించి క్రితి, ఆమె భర్త కృష్ణను అదుపులో ఉంచుకునన్నారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, వద్దని ఎంత చెబుతున్నా వినకుండా భార్యే ఈ దారుణానికి ఒడిగట్టిందని కృష్ణ పోలీసులకు తెలిపాడు. మరోవైపు మైనర్ బాలిక తల్లిదండ్రులు.. వరుసకి వదినా మరదళ్లు అవుతారు కాబట్టి స్నేహంగా ఉన్నారనుకున్నామని.. ఇలాంటి బంధం ఉందని తమకు తెలియదని వారు వాపోయిరు

ehatv

ehatv

Next Story