Nidhhi Agerwal : నిధి అగర్వాల్ ఘటనలో సుమోటోగా కేసు నమోదు
నటి నిధి అగర్వాల్‌కు లూలూ మాల్‌లో ఎదురైన చేదు అనుభవం చుట్టూ పెద్ద హడావిడి రేగింది.

నటి నిధి అగర్వాల్‌కు లూలూ మాల్‌లో ఎదురైన చేదు అనుభవం చుట్టూ పెద్ద హడావిడి రేగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలపై స్పందించిన కూకట్‌పల్లి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.బుధవారం లూలూ మాల్‌లో “రాజాసాబ్” సినిమాలోని రెండో పాట విడుదల కార్యక్రమానికి నిధి అగర్వాల్ హాజరయ్యారు. అయితే అకస్మాత్తుగా అభిమానుల పేరుతో గుమికూడిన కొంతమంది యువకులు ఆమెను ఇబ్బందులకి గురిచేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు సమాచారం అందింది.అనంతరం, ఆ సంఘటనపై సుమోటో చర్యగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈవెంట్ నిర్వాహకులు, మాల్ మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేయబడిందని అధికారులు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదని విచారణలో తేలిందని పోలీసులు వివరించారు.ప్రస్తుతం ఆ ఘటనపై విచారణ కొనసాగుతున్నదని, మాల్ సెక్యూరిటీ లోపాలపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం.


