Rayalseema Controversy: టీడీపీని ఇరికించిన రేవంత్రెడ్డి..!
Rayalseema Controversy: Revanth Reddy implicated TDP..!

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన కొన్ని మాటలు ఆంధ్రప్రదేష్‌లో అధికార తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులని ఆపివేయాలి అని చంద్రబాబు నాయుడుని తాను క్లోజ్డ్ రూమ్‌లో కోరాను, ఆ పనులు ఆపివేస్తే మాత్రమే ఫర్దర్ గా మిగతా ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైన చర్చలకు ముందుకు వస్తానని చెప్పాను, దీంతో నా మీద గౌరవంతో ఆయన ఆ నాలుగు గోడల మధ్యన జరిగిన సమావేశంలో, మేము మాట్లాడిన అంశాలను బేస్ చేసుకొని నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయి. ఆగిపోయాయి అనే దానిపైన ఎవరికైనా అనుమానం ఉంటే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన, ఎంఐఎం కి సంబంధించిన, కమ్యూనిస్ట్ పార్టీలకి సంబంధించిన సభ్యులందరితో కలిసి ఒక కమిటీ అక్కడికి వెళ్లి నిజ నిర్ధారణ చేసి రావచ్చు. చూసుకొని రావచ్చు, అక్కడ పనులు ఆగిపోయాయో లేదో అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఇది నేను తెలంగాణ కోసం సాధించిన ఘనత, ప్రతిరోజు మూడు టీఎంసిల చొప్పున శ్రీశైలం నుంచి నీటిని తోడుకునే అవకాశం రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఉండేది, దాన్ని లేకుండా చేశాను, తెలంగాణ ప్రయోజనాలని నేను కాపాడాను అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలు తెలంగాణ ప్రజల్లో. తెలంగాణ ప్రజలను తన వైపు తిప్పుకునేలా చేయడం. తెలంగాణ ప్రయోజనాలని చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నారు అంటూ, ఓ ప్రచారాన్ని బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో దాన్ని కౌంటర్ చేయడం కోసం రేవంత్ రెడ్డి బహుశా ఈ మాటలు మాట్లాడి ఉండొచ్చు. ఇప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ, మా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నారంటూ తెలుగు దేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు మాట్లాడుతూ ఉంటారు, ఆఫ్ రికార్డ్ చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మావాడిగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ కూడా భావిస్తూన్నట్టు ఇంప్రెషన్ చాలా సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తనపైన చంద్రబాబు అనుచరుడు, చంద్రబాబు శిష్యుడు అనే ముద్రను తొలగించుకోవాలి, అదే సమయంలో తాను తెలంగాణ ప్రయోజనాల కోసం ఉంటాను తప్ప, ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలని ఆంధ్రాకి తాకట్టు పెట్టను అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలి, పైగా తనకి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ నీటి ప్రయోజనాలు చాలా ముఖ్యం అనే విషయాన్ని చెప్పాలి దీనిలో భాగంగా ఆయన చాలా స్ట్రాటజిక్ గా అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులని ఆపించి వేశాడు అనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


