రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 రన్స్ తేడాతో ఓడించి తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను సాధించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 రన్స్ తేడాతో ఓడించి తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత బెంగళూరులోని రోడ్లు సంబరాలతో నిండిపోయాయి. ఇందిరానగర్, కోరమంగళ, ఎంజి రోడ్, విజయనగర వంటి ప్రాంతాల్లో ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి బాణసంచా కాల్చి, డాన్స్ చేస్తూ, "ఈ సాలా కప్ నమ్దే" (Ee Sala Cup Namde)అంటూ నినాదాలు చేశారు.అభిమానులు క్రాకర్లు పేల్చి, నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. కానీ.. ఓ ప్రేమ జంట మాత్రం హద్దు దాటారు.. ఏకంగా రోడ్డు పైనే రచ్చ రచ్చ చేశారు. ఆర్సీబీ (RCB)గెలిచిన ఆనందంలో బహిరంగంగా పరస్పరం కిస్ గిఫ్ట్ ఇచ్చుకుని ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను shwethaveena3 అనే ఖాతా షేర్ చేసింది. ఈ వీడియోలో, ఇద్దరు ప్రేమికులు బహిరంగ ప్రదేశంలో లిప్-టు-లిప్ ముద్దు పెట్టుకుంటూ ఆర్సీబీ విజయాన్ని జరుపుకుంటున్నారు. ఆర్సీబీ గెలిస్తేనే.. ముద్దు పెట్టుకునేందుకు ప్రియురాలు ఓకే చెప్పిందంటూ అందులో రాసి ఉంది.. అయితే.. ఈ వీడియోలో అందరూ ఆర్సీబీ గెలిచిందంటూ చాలామంది రోడ్డుపై సంబరాలు జరుపుకుంటున్నారు. వారంతా ఓ పక్క పండగా చేసుకుంటే.. ఈ జంట మాత్రం ముద్దుల్లో మునిగితేలారు.

ehatv

ehatv

Next Story