డబ్బుండాలే కానీ ఏమైనా చేయొచ్చు. కొండమీద కోతిని కూడా దింపొచ్చు. బోర్‌ కొట్టేస్తే వివాహబంధాన్ని తెంచేసుకోవచ్చు. అమెరికా(America) కోటీశ్వరుడు, మీడియా మొఘల్‌గా ప్రసిద్ధిపొందిన రుపర్ట్ ముర్డోచ్‌(Rupert Murdoch) ఆ పనే చేశారు. 92 ఏళ్ల వయసులో తన నాలుగో భార్య జెర్రీ హాల్‌(Jerry Hall)కు విడాకులు(Divorce) ఇచ్చేశాడు. కేవలం 11 పదాల సందేశాన్ని ఈ-మెయిల్‌(E-mail) చేసి జెర్రీహాల్‌తో బంధాన్ని తెంచుకున్నాడు. ఈ మెయిల్‌ వచ్చినప్పుడు పాపం ఆమె ఇంట్లో ముర్డోచ్‌ కోసం ఎదురుచూస్తున్నారట!

డబ్బుండాలే కానీ ఏమైనా చేయొచ్చు. కొండమీద కోతిని కూడా దింపొచ్చు. బోర్‌ కొట్టేస్తే వివాహబంధాన్ని తెంచేసుకోవచ్చు. అమెరికా(America) కోటీశ్వరుడు, మీడియా మొఘల్‌గా ప్రసిద్ధిపొందిన రుపర్ట్ ముర్డోచ్‌(Rupert Murdoch) ఆ పనే చేశారు. 92 ఏళ్ల వయసులో తన నాలుగో భార్య జెర్రీ హాల్‌(Jerry Hall)కు విడాకులు(Divorce) ఇచ్చేశాడు. కేవలం 11 పదాల సందేశాన్ని ఈ-మెయిల్‌(E-mail) చేసి జెర్రీహాల్‌తో బంధాన్ని తెంచుకున్నాడు. ఈ మెయిల్‌ వచ్చినప్పుడు పాపం ఆమె ఇంట్లో ముర్డోచ్‌ కోసం ఎదురుచూస్తున్నారట! 'మనమిద్దరం కచ్చితంగా మంచి సయమం గడిపాం. కానీ నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది. నా న్యూయార్క్ లాయర్(newyork lawyer) తక్షణమే వచ్చి నిన్ను కలుస్తారు' ఇదీ జెర్రీకి ముర్డోచ్‌ పంపిన విడాకుల సందేశం. వీరిద్దరు సుమారు ఆరేళ్ల పాటు కలిసి ఉంటున్నారు. మరి ముర్డోచ్‌కు బోర్‌ కొట్టిందో, అయిదో పెళ్లి మీద మనసుపారేసుకున్నాడో తెలియదు కానీ జెర్రీని వదిలేసుకున్నాడు. 65 ఏళ్ల జెర్రీకి ఇదే మొదటి వివాహం. కాకపోతే అంతకు ముందు రాక్‌స్టార్‌ మిగ్‌ జాగర్‌(Rockstar Mig Jagar)తో కొంతకాలం రిలేషన్‌లో ఉండింది.

లాస్టియర్‌ జూన్‌లోనే వీరిద్దరు విడిపోయారట. అప్పుడు ముర్డోచ్‌ పంపిన విడాకుల సందేశం చదివి జెర్రీ హాల్‌ బిత్తరపోయారట. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదట. ముర్డోచ్‌ ఎంత కఠినాత్ముడంటే అలా విడాకుల సందేశం పంపాడో లేదు, ఇలా కాలిఫోర్నియాలోని తన మ్యాన్షన్‌ హౌస్‌ విడిచి వెళ్లిపోవాలని గట్టిగా చెప్పాడట. పాపం నెల రోజుల గడువు మాత్రమే ఇచ్చాడట. ఇంతకాలానికి ఇదంతా జెర్రీ స్నేహితులు చెప్తేనే తెలిసింది.14.5 బిలియన్‌ డాలర్లకు అధిపతి అయిన ముర్డోచ్‌కు ఆరుగురు సంతానం. జెర్రీకి మాత్రం సంతానం కలగలేదు. కాబట్టి అతడి ఆస్తిలో జెర్రీకి వాటా వచ్చే ఛాన్సే లేదు. 2016లో సెంట్రల్‌ లండన్‌లో ముర్డోచ్‌, జెర్రీల పెళ్లి చాలా గొప్పగా జరిగింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో తెలిపాడు ముర్డోచ్‌. పైగా ఈ ప్రపంచంలో తాను అత్యంత అదృష్టవంతుడినని, సంతోషమైన వ్యక్తిని అని రాసుకొచ్చారు. ఫ్యూచర్‌లో తాను ట్విట్టర్లో ఎలాంటి పోస్టులు పెట్టొబోనని ఈ సందర్భంగాప్రకటించారు. జెర్రీకి విడాకులు ఇచ్చి ఏడాదైనా గడవలేదు అప్పుడే అయిదో పెళ్లికి రెడీ అయ్యాడు ముర్డోచ్‌ . ఏడు నెలల కిందట పరిచయం అయిన అనలెస్లీ స్మిత్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు మార్చిలో ప్రకటించాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరు పెళ్లి ఆలోచన విరమించుకున్నారు. అయిదో పెళ్లి ఆగిపోయింది. ది సన్, ది టైమ్స్ వంటి న్యూస్‌పేపర్లు, ఫాక్స్ న్యూస్, ది వాల్ స్ట్రీట్ జర్నల్‌ వంటి మీడియా సంస్థలకు ముర్డోచ్ యజమాని అని వేరే చెప్పనక్కర్లేదు.. ఆస్ట్రేలియాలో జన్మించిన ఈయన అమెరికాలో స్థిరపడ్డారు.

Updated On 13 April 2023 11:46 PM GMT
Ehatv

Ehatv

Next Story