ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar)ది ప్రత్యేక అధ్యాయం. పదహారేళ్ల ప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌గా (Master Blaster)పేరుగాంచాడు. అనేక రికార్డులను సృష్టించాడు. అలవోకగా పరుగులు సాధించాడు. 1989లో అరంగేట్రం చేసిన సచిన్‌ 2013లో ఇంటర్నేషనల్ క్రికెట్‌ (International)నుంచి తప్పుకున్నాడు. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో లెక్కకు మించిన ఘనతలు సాధించాడు.

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar)ది ప్రత్యేక అధ్యాయం. పదహారేళ్ల ప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌గా (Master Blaster)పేరుగాంచాడు. అనేక రికార్డులను సృష్టించాడు. అలవోకగా పరుగులు సాధించాడు. 1989లో అరంగేట్రం చేసిన సచిన్‌ 2013లో ఇంటర్నేషనల్ క్రికెట్‌ (International)నుంచి తప్పుకున్నాడు. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో లెక్కకు మించిన ఘనతలు సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన ఆటగాడు సచిన్‌ ఒక్కటే! అత్యధిక పరుగులు సాధించింది కూడా ఇతడే! అయితే ఆస్ట్రేలియన్ల దృష్టిలో మాత్రం వెస్టిండీస్‌ బ్యాటర్‌ బ్రియన్‌ లారా(Brian Lara)నే సచిన్‌ కంటే గొప్ప ఆటగాడని భావిస్తారట! ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా (South Africa)మాజీ కెప్టెన్‌ అలీ బచర్‌ ( Ali Bacher)చెప్పాడు. ఆయన మాత్రం సచినే గొప్ప అంటున్నారు. సచిన్‌ గొప్ప క్రికెటరే కాదని, మంచి మనిషి కూడా అని బచర్‌ అభిప్రాయపడ్డాడు. సచిన్‌ అసాధారణ ఆటగాడని, అతడు వేరే గ్రహం (another world)నుంచి వచ్చాడనే తాను భావిస్తానని చెప్పాడు. అతడు ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌ను ఎన్నో చూశానని బచర్‌ వివరించాడు. బ్రియన్‌ లారా 40 లక్షల మంది ముందు ఆడితే సచిన్‌ 140 కోట్ల మంది కోసం ఆడాడని, అలాంటప్పుడు అతడిపై ఎంత ఒత్తిడి ఉంటుందో ఆలోచించండి అని బచర్‌ తెలిపాడు.

Updated On 1 Jan 2024 2:36 AM GMT
Ehatv

Ehatv

Next Story