Sankranti, is the festival of 'Kamma': సంక్రాతి 'కమ్మ'వారి పండగ.. జర్నలిస్ట్ శివలక్ష్మి వ్యాఖ్యలపై దుమారం..!

సంక్రాతి 'కమ్మ'వారి పండగ.. జర్నలిస్ట్ శివలక్ష్మి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సంక్రాంతి పండగ అంటేనే కమ్మవారిది అన్న అర్థం వచ్చేలా ఇటీవల కమ్మవారి చరిత్ర అంటూ ఆమె ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ '' ఏది ఏమైనా కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు, వడ్లు చేతికి అందుతాయి, పొంగలు చేసుకుంటారు, చెరుకు గడలు, కొత్త కందులు ఇవన్నీ చేతికందే సమయం. ఇంకా నెల రోజుల్లో మామిడి పంట పూత తొడగడానికి సిద్ధమవుతున్న సమయం. ఎద్దుల పోటీలు, కోడి పందాలు, కొబ్బరి పందాలు, ఇలా వారి ఆటలు పాటలు కూడా పంటలతో తమ ఇంటి జంతువులతో కలిసే ఉంటాయి. అందుకే సంక్రాంతి 'కమ్మవారి' పండుగగా అయింది, కమ్మవారి పండుగగా ఉండేది, అటు హరిదాసులకే కాదు, ఎవ్వరు ఇంటి ముందుకు వచ్చి అడిగినా, ఇది లేదనకుండా అన్నం పెట్టే కాలం, కమ్మవారి కాలం. అమ్మలక్కలంతా ఒక్క చోట చేరి కలిసి ఉండే అరిసెలు, జంతికలు, ఈ పండగకి నా కమ్మ ఫ్రెండ్ తెచ్చే కమ్మని పండుగ పప్పలు ప్రత్యేకం అని కాలేజీ హాస్టల్స్ లో సందడి చేసే కుర్రవాళ్ళు, అందుకే సంక్రాంతి కమ్మవారి ప్రత్యేక పండుగ. కోడికూర చిల్లిగారెలతో సందడి చేసే, గ్రామ గ్రామాన ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రత్యేకించి కమ్మవారి అందరికీ కూడా, ఈ కమ్మవారి చరిత్ర సందర్భంగా ఈ సంక్రాంతికి, రైతులందరికీ కూడా శుభాకాంక్షలు'' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది.

అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. మతాల పరంగా పండుగలు ఉంటాయి. హిందువులకు దీపావళి, సంక్రాంతి వినాయక చవితి, దసరా ఇలా ఉంటాయి కానీ, కులానికి ఓ పండగ ఎలా ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. క్రిస్టియన్స్‌కి క్రిస్మస్. ఈస్టర్, ముస్లింలకు రంజాన్, బక్రీద్, మొహర్రం అలా ఉంటాయి. కానీ కులాల పరంగా, కులాల ప్రాతిపదికన పండగలు ఉంటాయని ఎవరికీ తెలియదని చెప్తున్నారు. అసలు సంక్రాంతిని రెండు తెలుగురాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో పేరుతో చేసుకుంటుందని అంతే కానీ కేవలం ఒక కులానికి సంక్రాంతిని ఎలా పరిమితం చేస్తారో చెప్పాలంటున్నారు. ఓన్లీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే సంక్రాంతి జరుపుకోవాలి, మిగతా వాళ్ళు జరుపుకోకూడదనేలా ఆమె చేసిన వ్యాఖ్యలున్నాయని విమర్శిస్తున్నారు. ప్రతి ఒక్క హిందువు, హిందువు ఏంటి అన్ని కులాల వాళ్లు, అన్ని మతాల వాళ్లు కూడా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు. హైదరాబాద్‌లో చూస్తే ఎన్ని చోట్ల ఈ గాలిపటాలు ఎగిరేస్తారు, ఓన్లీ హిందువులే ఎగిరేయాలని రూల్ లేదు, సరదాగా సెలవులు ఉండడంతో హిందువులతో పాటు ముస్లింలు కూడా పతంగులు ఎగరేస్తారు. ఎవరైనా తమ కులం గురించి గొప్పలు చెప్పుకోవచ్చు, మా కులం గొప్పది, మా కులంవాళ్లు ఆరులు, వీరులు, శూరులు అని చెప్పుకోవచ్చు కానీ, పండగలను కులానికి ఆపాదించడమేంటని ప్రశ్నిస్తున్నారు ఇతర కుల సంఘాలు.

Updated On
ehatv

ehatv

Next Story