Sex with 583 Men in 6 Hours : 6 గంటల్లో 583తో సెక్స్.. ఈ సారి వెయ్యి మంది ఆమె లక్ష్యం.. ప్రియుడే దగ్గరుండి మరీ..!
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులు, కొత్త ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. ఇటీవల ఒక యువ ఆస్ట్రేలియన్ మహిళ( Australian Woman) తన వినూత్న ప్రయత్నంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులు, కొత్త ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. ఇటీవల ఒక యువ ఆస్ట్రేలియన్ మహిళ( Australian Woman) తన వినూత్న ప్రయత్నంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఒక ప్రత్యేకమైన రికార్డును నమోదు చేసి వార్తల్లో నిలిచింది. యానీ నైట్ (Annie Knight) "ఆస్ట్రేలియా(Australia)లోనే అత్యంత సెక్సువల్‌గా యాక్టివ్ మహిళ"గా పేరు తెచ్చుకుంది. మే 18న, ఆమె ఒక సవాలు స్వీకరించి, 6 గంటల్లో 583 మంది పురుషులతో శృంగారంలో పాల్గొంది. ఈ ఈవెంట్ గోల్డ్ కోస్ట్‌లో ఓ స్వింగర్స్ క్లబ్(Swingers club)లో జరిగింది, దీనిని ఆమె స్వయంగా ఏర్పాటు చేసింది. ఆమె లక్ష్యం 200 మంది ఉండగా, 2,000 మంది రిజిస్టర్ చేసుకోగా, చివరికి 583 మంది హాజరయ్యారు. ఈ సవాలు కోసం ఆమె సెక్యూరిటీ, కండోమ్‌లు, పాల్గొనేవారి ఏర్పాట్లు చేసింది. ప్రతి గంటకు 15 నిమిషాల విరామం తీసుకుంటూ ఉంది. ఆమె ఈ అనుభవాన్ని "నా జీవితంలో అత్యుత్తమ రోజు"గా వర్ణించింది, కానీ ఈ సవాలు తర్వాత ఆమె ఆరోగ్యం దెబ్బతింది. మే 20న, ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఆమెకు అధిక రక్తస్రావం, కడుపు నొప్పులు వచ్చాయి. ఆమెకు ఇంతకు ముందే ఎండోమెట్రియోసిస్ అనే వ్యాతి ఉంది. ఆమె ఒత్తిడి వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యాయని చెప్పింది, అయితే ఈ సవాలు నేరుగా ఆరోగ్య సమస్యలకు కారణమా లేక ఆమె ఎండోమెట్రియోసిస్ వల్లనా అనేది స్పష్టంగా తెలియలేదు. ఒక వారం విశ్రాంతి తీసుకుని కోలుకుంటానని ఎని నైట్ చెప్పింది. ఆమె ఈ ఈవెంట్‌కు ముందు తన ఫియాన్స్ హెన్రీ బ్రేషా నుంచి మద్దతు తీసుకుంది. అతను ఆమె సవాలు విజయవంతంగా పూర్తి చేసినందుకు సంతోషించాడు. ఆమె ఈ సవాలు కోసం స్పష్టమైన రూల్స్ పెట్టుకుంది. కండోమ్‌లు తప్పనిసరిగా ఉపయోగించారు, పాల్గొనేవారి వివరాలు గోప్యంగా ఉంచారు. కానీ ఈ తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతినడానికి ఒక కారణం అయ్యింది. ఈ ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ విమర్శలు వచ్చాయి, కొందరు దీన్ని "డిగ్రేడింగ్" అని, మరికొందరు ఆమెను "ఎంపవర్డ్" అని పేర్కొన్నారు. ఆమె 2025లో 1,000 మందితో శృంగారం లక్ష్యంగా పెట్టుకుంది.
