Silvio Berlusconi : గర్ల్‌ఫ్రెండ్‌కు 900 కోట్ల రూపాయలు.. విల్లు రాసిన బెర్లుస్కోనీ
అదృష్టం ఆమెను అంటిపెట్టుకుని ఉంది కాబట్టే మాజీ ప్రధానికి(Ex-PM) ప్రియురాలు కాగలిగింది. ఆయన ఆస్తిలో ఓ భాగం ఆమె వంతయ్యింది. 900 కోట్లకు అధిపతురాలయ్యింది. ఆమె పేరు మార్టా ఫాసినా(Marta Fascina).. ఆ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ(Silvio Berlusconi).. మూడు సార్లు ఇటలీకి ప్రధానమంత్రిగా పని చేశారు. ఇటలీలో అత్యధిక కాలంలో ప్రధానమంత్రిగా పని చేసిన రికార్డు ఆయన పేరిట ఉంది. దాంతో పాటు అనేక కుంభకోణాలలో బెర్లుస్కోనీ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. బుంగా బుంగా(Bunga Bunga) పార్టీలతో వివాదాస్పద నేతగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే ఆయన తన 86 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచారు.

Silvio Berlusconi
అదృష్టం ఆమెను అంటిపెట్టుకుని ఉంది కాబట్టే మాజీ ప్రధానికి(Ex-PM) ప్రియురాలు కాగలిగింది. ఆయన ఆస్తిలో ఓ భాగం ఆమె వంతయ్యింది. 900 కోట్లకు అధిపతురాలయ్యింది. ఆమె పేరు మార్టా ఫాసినా(Marta Fascina).. ఆ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ(Silvio Berlusconi).. మూడు సార్లు ఇటలీకి ప్రధానమంత్రిగా పని చేశారు. ఇటలీలో అత్యధిక కాలంలో ప్రధానమంత్రిగా పని చేసిన రికార్డు ఆయన పేరిట ఉంది. దాంతో పాటు అనేక కుంభకోణాలలో బెర్లుస్కోనీ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. బుంగా బుంగా(Bunga Bunga) పార్టీలతో వివాదాస్పద నేతగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇటీవలే ఆయన తన 86 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచారు. బతికున్నప్పుడే తన వీలునామాలో ఆ బిలియనీర్ గర్ల్‌ఫ్రెండ్‌కు అంటే మార్టా ఫాసినాకు(Marta Fascina) భారీ షేర్ ఇచ్చారు. అయిదుగురు పిల్లల ముందే ఆ వీలునామా చదివారాయన! సోదరుడుతో పాటు మరో పార్టీ నేతకు కూడా వంద మిలియన్ల యూరోలు ఇచ్చారు. తన విల్లులో 33 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్ మార్టా ఫాసినాకు వంద మిలియన్ల యూరోలు కేటాయించారు. మన కరెన్సీలో చెప్పుకుంటే 900 కోట్ల రూపాయలు.. అంతేసి సొమ్మును అంతంత మందికి పంచిపెట్టారంటే ఈయన ఆస్తి ఎంతుంటుందనేగా మీ డౌటు. ఆరు బిలియన్ల యూరోలు(6 Billion Euros). 2020 నుంచి ఆమె బెర్లుస్కోనీతో రిలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఫోర్జా ఇటాలియా పార్టీలో(Forza Italian Party) డిప్యూటీగా కొనసాగుతున్నారు. ఇటలీ దిగువ సభలో మార్టా ఫాసినా సభ్యురాలిగా కూడా ఉన్నారు.
నిజానికి ఆమెను బెర్లుస్కోనీ అధికారికంగా పెళ్లి చేసుకోలేదు. కానీ చనిపోతున్న సమయంలో ఆమెను భార్యగా పేర్కొన్నారట. జూన్ 12వ తేదీన బెర్లుస్కోనీ చనిపోయారు. అయితే తన అయిదుగురు పిల్లల ముందే ఆయన రాసిన వీలునామాను చదివి వినిపించారు. స్టాక్స్ అన్నీ పిల్లలకు సమానంగా చెందాలని విల్లులో పేర్కొన్నారు. తన సోదరుడు పావలోకు వంద మిలియన్ల యూరోలను కేటాయించిన ఆయన తన పార్టీకి చెందిన మాజీ సెనేటర్ మార్సిలో డెల్‌ఉట్రికి 30 మిలియన్ల యూరోలు వాటాగా ఇచ్చారు బెర్లుస్కోనీ..
