Telangana Minister : పవన్.. సారీ చెప్పకపోతే.. బిడ్డా.. నీ సినిమాలు తెలంగాణలో బంద్..!
కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వారి 'దిష్టి' తగిలిందన్న పవన్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి

కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వారి 'దిష్టి' తగిలిందన్న పవన్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కోనసీమలో కొబ్బరి చెట్ల సమస్యలపై కోనసీమ పవన్ కల్యాణ్ కేశనపల్లి, రాజోలే మండలంలో దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన తర్వాత రైతులతో మాట్లాడుతూ:"గోదావరి జిల్లాల ఆకుపచ్చపై తెలంగాణ ప్రజల 'దిష్టి' కోనసీమపై పడింది, అందుకే కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి." అని వ్యాఖ్యానించారు.
దీనిపై తెలంగాణ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. కోనసీమకు వెళ్లని తెలంగాణ ప్రజల దిష్టి ఎలా చేరుతుంది? ఆంధ్రలో జీవనోపాధి కోసం తెలంగాణకు వచ్చేవారే. పవన్ మాట్లాడే మాటలు ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ దిష్టి కోనసీమకు పడితే, పవన్ హైదరాబాద్‌లో ఎందుకు ఉన్నారు? విజయవాడకు వెళ్లిపోవాలి" అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. అసలు పవన్ ఇంకో 70 ఏళ్లయినా ముఖ్యమంత్రి కాలేరని వ్యాఖ్యానించారు. పవన్ కెరీర్ తెలంగాణ సంపదలతోనే ఎదిగింది. ఇలాంటి బాధ్యత లేని మాటలు మానుకోవాలి" అని మంత్రి వాకాటి శ్రీహరి విమర్శించారు. పవన్ తెలంగాణ వదిలి వెళ్లకపోతే తరిమేస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు.
తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే పవన్‌కల్యాణ్ ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలు తనన బాధించాయన్నారు. వెంటనే బేషరతుగా పవన్ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ పవన్‌కల్యాణ్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని ఆయన హెచ్చరించారు. సినిమాటోగ్రఫీశాఖ మంత్రిగా చెబుతున్నా…పవన్‌కు సంబంధించి ఒక్క సినిమాను కూఢా థియేటర్‌లో విడుదల కానివ్వమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి సూపర్‌స్టార్ అయినా మంచోడని కోమటిరెడ్డి కితాబిచ్చారు. తెలంగాణ దిష్టి కాదు, ఆంధ్రా పాలకుల వల్ల తమ రాష్ట్ర ప్రజలు ప్లోరైడ్ విషం తాగారని ఆవేదన వ్యక్తం చేశారు.


