అధికారంలోకి వచ్చేంత వరకు తీయని మాటలు చెబుతారు. వచ్చాక తమ సహజస్వభావాన్ని చూపిస్తారు. తాలిబన్లు కూడా అంతే..! తాము పూర్తిగా మారిపోయామని, మునుపటిలా కాదని, అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పుకొచ్చారు.

అధికారంలోకి వచ్చేంత వరకు తీయని మాటలు చెబుతారు. వచ్చాక తమ సహజస్వభావాన్ని చూపిస్తారు. తాలిబన్లు కూడా అంతే..! తాము పూర్తిగా మారిపోయామని, మునుపటిలా కాదని, అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక అసలు స్వరూపాన్ని చూపిస్తున్నారు. పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. 2021 ఆగస్టులో అఫ్గనిస్తాన్‌ను(Afghanisthan) తమ చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి తాలిబన్లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎప్పటిలాగే మహిళలపై అణచివేతను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మహిళల(Females) ఉన్నత చదువులపై ఆంక్షలు విధించారు. కొన్ని ఉద్యోగాలు(Jobs) మహిళలు చేయడానికి వీల్లేదన్నారు. ఈద్‌(Eid) వేడుకల్లోనూ పాల్గొనకుండా నిషేధం విధించారు. ఇప్పుడేమో మహిళా బ్యూటీ సెలూన్లపై(Beauty Salon) కూడా నిషేధం విధించింది తాలిబన్‌ ప్రభుత్వం(Taliban government).

ఇక నుంచి మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని మంత్రి మహ్మద్‌ అకిఫ్‌ మహజర్‌(Mohammad Akif Mahajar) ప్రకటించారు. దేశ రాజధాని కాబూల్‌తో(Kabul)పాటు దేశంలోని ఇతర ప్రావిన్సుల్లో మహిళలు నిర్వహించే అన్ని బ్యూటీ సెలూన్ లను నిషేధిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఆదేశాలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. సెలూన్లు తమ కార్యకలాపాలను నిలిపివేసేందుకు జులై 2 నుంచి నెల గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత తమ మూసివేత గురించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు మహ్మద్‌ అకిఫ్‌ మహజర్‌. దీనిపై మేకప్‌ ఆర్టిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలే కానీ దేశాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదని సామాన్య ప్రజలు కూడా అంటున్నారు.

Updated On 5 July 2023 5:45 AM GMT
Ehatv

Ehatv

Next Story