వరల్డ్‌ హెరిటేజ్‌ డే (world heritage day) ! వారసత్వ ప్రదేశాలు, కట్టడాల పట్ల అవగాహన కల్పించడం కోసం, వాటిని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను తెలియచేయడం కోసం యునెస్కో(unesco) నిర్వహిస్తోన్న రోజుది! ప్రతి ఏడాది ఏప్రిల్‌ 18న ప్రపంచమంతా వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణం అని చిన్నప్పుడు ప్రతిజ్ఞలు చేశాం కానీ వారసత్వ సంపదను కాపాడుకునే విషయంలో మాత్రం అశ్రద్ధ చూపుతుంటాం.

వరల్డ్‌ హెరిటేజ్‌ డే (world heritage day) ! వారసత్వ ప్రదేశాలు, కట్టడాల పట్ల అవగాహన కల్పించడం కోసం, వాటిని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను తెలియచేయడం కోసం యునెస్కో(unesco) నిర్వహిస్తోన్న రోజుది! ప్రతి ఏడాది ఏప్రిల్‌ 18న ప్రపంచమంతా వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణం అని చిన్నప్పుడు ప్రతిజ్ఞలు చేశాం కానీ వారసత్వ సంపదను కాపాడుకునే విషయంలో మాత్రం అశ్రద్ధ చూపుతుంటాం. నిర్లక్ష్యం వహిస్తుంటాం. చారిత్రక ఆధారాలను చేజేతులా నాశనం చేస్తుంటాం. పురాతన కట్టడాలను కూల్చివేస్తుంటాం! చరిత్రంటే మనకు చిన్నచూపు.. మిగతా దేశాలవాళ్లు చరిత్రను నెత్తికెత్తుకుంటారు. చారిత్రక కట్టడాలను భద్రంగా కాపాడుకుంటారు. చారిత్రక ప్రదేశాలను రక్షించుకుంటారు.. తెలిసో తెలియకో నిర్లక్ష్యమో, నిరాసక్తతో, ప్రకృతి విపత్తో తెలియదు కానీ ప్రపంచంలో చాలా ప్రాచీన కట్టడాలు నేలకూలాయి. కొన్ని జీర్ణావస్థ స్థితికి చేరుకున్నాయి వీటిని అరికట్టడం కోసం 1972లో ఐక్య రాజ్యసమితి (UNO) ఓ తీర్మానం చేసింది. అందుకు అనుగుణంగానే ప్రతి ఏడాది ఏప్రిల్‌ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారతదేశంలో అనేకానేక వారసత్వ సంపదలు ఉన్నాయి. అందులో కొన్నింటిని యునెస్కో గుర్తించింది కూడా!

గుజరాత్‌లోని పఠాన్ పట్టణానికి వెళితే అక్కడో అద్భుతం చూడవచ్చు.. ఆ అద్భుతం పేరు రాణి కీ వావ్‌ (rani ki vav)...యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న ఆ అపురూప కట్టడం నిజంగానే ఓ అత్యద్భుతం.. ఈ అద్భుతాన్ని చూసి యునెస్కో కూడా ఆశ్చర్యపోయింది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడమన్నది యునెస్కో ఎక్కడా చూసి ఉండదు.. అప్పటి ఇంజనీర్ల సాంకేతిక నైపుణ్యానికి అబ్బురపడకుండా ఉండలేం.. 11వ శతాబ్దంలో నిర్మించిన ఇలాంటి ఏడు భూగర్భ అంతస్తుల బావి ప్రపంచంలో మరెక్కడా లేదు.. ఇది ఉత్తి బావే కాదు... కళాత్మతకు.. నిర్మాణ కౌశలానికి ప్రతీక! భూగర్భ జలాలను సమృద్ధిగా... సమర్థంగా వాడుకునేందుకు తవ్విన బావి ఇది! సోలంకి (solanki)సంస్థానానికి చెందిన రాణీ ఉదయమతి తన భర్త భీమ్‌దేవ్‌ జ్ఞాపకార్థం నిర్మించిన బావి ఇది! ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం ఈ మెట్లబావి! 1063లో నిర్మించిన బావి తదనంతర కాలంలో సరస్వతి నదికి వచ్చిన వరదల కారణంగా పూడికతో నిండిపోయింది. 1980 ప్రాంతంలో పురాతత్వ శాస్ర్తవేత్తలు తవ్వకాలు జరపడంతో ఈ అపూర్వ నిర్మాణం వెలుగులోకి వచ్చింది.

చూస్తే దేవాలయంలా అనిపిస్తుంది కానీ ఈ కట్టడాన్ని మాత్రం కేవలం నీటి కోసమే నిర్మించారు. ఏడు అంతస్తులు ఉన్న ఈ బావిలో ప్రస్తుతం మాత్రం అయిదింటిని మాత్రమే మనం చూడగలం. నలు చదరంగా ఉండే ఈ మెట్ల బావి నిర్మాణాన్ని చూసి ఈనాటి ఇంజనీర్లు కూడా అశ్యర్యపోతున్నారు. ఈ నిర్మాణంలో ఎటు చూసినా విస్మయాన్ని గొలిపే అద్భుత శిల్పకళ కనిపిస్తుంది.. 209 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు, 88 అడుగుల లోతుతో ఉన్న ఈ బావి నిజంగానే ఓ అపురూప కట్టడం. ఈ నిర్మాణంలో దాదాపు పదిహేను వందల దేవతా శిల్పాలు ఉన్నాయి. విష్ణమూర్తి దశావతారాలను ఇక్కడ చూడవచ్చు. వారాహి, వామన, నరసింహ, రామ, కల్కి మూర్తులు ఆకట్టుకుంటాయి. ఇక మహిషాసురమర్ధిని శిల్పం ప్రత్యేక ఆకర్షణ.. అప్పరసల శిల్పాల గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. అన్నట్టు ఈ బావి అడుగున 28 కిలోమీటర్ల పొడవున ఓ సొరంగం ఉందట! అయితే ఆ సొరంగం ఇప్పుడు మట్టితో నిండిపోయిందట! ఒకప్పుడు ఈ మెట్ల బావి చివరకు వరకు సందర్శకులు వెళ్లేవారు.. ఆసాంతమూ తిలకించి వచ్చేవాళ్లు.. అయితే భుజ్‌లో వచ్చిన భూకంపం రాణి కి వావ్‌ నిర్మాణాన్ని కాసింత దెబ్బతీసింది.. మరింత నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పురావస్తు శాఖ అధికారులు కొన్ని భాగాలను మూసేశారు.

Updated On 18 April 2023 2:41 AM GMT
Ehatv

Ehatv

Next Story