ప్రముఖ యూట్యూబర్, నా అన్వేషణ అన్వేష్‌పై నెటిజన్ల ఆగ్రహం చవిచూస్తున్నాడు.

ప్రముఖ యూట్యూబర్, నా అన్వేషణ అన్వేష్‌పై నెటిజన్ల ఆగ్రహం చవిచూస్తున్నాడు. నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రదుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత రాగా.. సోషల్ మీడియాలో మాత్రం శివాజీకే సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది. ఈ విషయంపై ప్రముఖ యూట్యూబర్, నా అన్వేషణ అన్వేష్ చేసిన వీడియోలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పచ్చిబూతులు మాట్లాడుతూ చేసిన వీడియోలతో అతడిని అన్ ఫాలో చేయడంతో పాటు.. అకౌంట్ రిపోర్ట్ కొడుతున్నారు. నిన్న ఇన్ స్టాలో అతని ఫాలోవర్స్ 1.8 మిలియన్స్ ఉండగా.. ఈరోజు 1.4 మిలియన్ కు తగ్గిపోయారు. అలాగే యూట్యూబ్‌లో 2.8 మిలియన్స్‌ ఉండగా ఈరోజు 2.34కు తగ్గిపోయారు. అంటే ఏకంగా 26 లక్షల ఫాలోవర్స్ అన్‌ ఫాల్‌ అయ్యారు.

భారీగా ఫాలోవర్స్ అన్ ఫాలో కొట్టడం, అకౌంట్ రిపోర్ట్ చేస్తుండటంతో అన్వేష్ తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతూ వీడియో పోస్ట్ చేశాడు. శివాజీని, గరికపాటిని అనరాని మాటలు అంటూ.. హిందూ దేవుళ్లను సైతం అవమానించాడు. సీతాదేవి, ద్రౌపది గురించి చేసిన వ్యాఖ్యలతో నెటిజన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విశ్వహిందూ పరిషత్ సంస్థ కూడా అన్వేష్ వీడియోలపై స్పందించి.. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యానించిన శివాజీనే మహిళా కమిషన్ పిలిచి ప్రశ్నించిందని, అన్వేష్ మాట్లాడిన మాటలను సుమోటాగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అతన్ని ఇండియాకు రప్పించి, కేసులు నమోదు చేసి పాస్ పోర్ట్ సీజ్ చేయాలని, అలాగే అతని యూట్యూబ్ ఛానల్ కు రిపోర్ట్ చేసి మూసివేయించాలన్న డిమాండ్‌ చేస్తున్నారు హిందూ సంఘాలు, హిందువులు.

Updated On
ehatv

ehatv

Next Story