Anveshana Controversy : నువ్వెవడురా నేను హిందువుని కాదనడానికి.. ఐయామ్ సారీ.. నో సారీ..!
ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ విషయంలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే.

ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ విషయంలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. కొంత మంది మహిళలు శివాజీ వ్యాఖ్యలకు సపోర్ట్ చేయగా, మరికొంత మంది సెలబ్రీటీలు మాత్రం ఆయన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఒకరి డ్రెస్సింగ్ సెన్స్ ను ఏవిధంగా జడ్జ్ చేస్తామని శివాజీకి కౌంటర్ లు వేశారు. ఈ వివాదం నేపథ్యంలో శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళ కమిషన్ ముందు హజరై క్షమాపణలు కూడా చెప్పారు. అదే విధంగా తన వివరణ కూడా ఇచ్చారు.
అయితే.. తాజాగా.. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్.. చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారాయి. ఆ నీచుడు ఏకంగా హిందు దేవుళ్లను, ప్రవచన కర్త గరిక పాటిశ్రీనివాస్ రావు గారిని శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదంలోకి లాగాడు. శివాజీ వ్యాఖ్యల్ని పూర్తిగా యూట్యూబర్ తప్పుపట్టాడు. అసలు హీరోయిన్లు బోల్డ్ గా డ్రెస్సింగ్ లు వేసుకొకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ నీచంగా మాట్లాడాడు. అంతటితో ఆగకుండా.. ప్రవచన కర్త గరికపాటి గురించి మాట్లాడారు. రామాయణం, మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ.. మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి, ద్రౌపదిల గురించి కూడా చాలా జుగుప్సాకరంగా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే నా అన్వేషణ యూట్యూబర్‌ను ఇండియాకు రప్పించాలని హిందు సంఘాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి.
అయితే దీనిపై మరో వీడియోను అన్వేష్ విడుదల చేశారు. తాను పక్కా హిందువునని, అన్ని దేశాల్లో ఉన్న హిందూ దేవాలయాలను నేను వీడియోల్లో చూపిస్తానన్నాడు. ప్రతిరోజూ వినాయకుడిని పూజిస్తానని, తాను హిందువుని కాదని చెప్పడానికి మీరెవరంటూ రివర్సయ్యాడు. తాను విదేశాల్లో తిరుగుతూ సంపాదించినా భారత్‌కే ట్యాక్స్ కడుతున్నానన్నాడు. తాను హిందువునని.. కానీ హిందుసంఘాలకు, హిందువులకు క్షమాపణ చెప్పేది లేదని వీడియో విడుదల చేశాడు అన్వేష్.


