Bihar Elections : బీహార్‌లో అధికారికంగా ఓట్ల కొనుగోలు
దేశంలో ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

దేశంలో ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ తప్పు చేస్తోంది అంటూ బలంగా నమ్ముతున్న వాళ్ళ సంఖ్య ఉంది. ఎన్నికల కమిషన్ మాతోటే ఉంది, ఎన్నికల కమిషన్ మాకు అనుకూలంగా ఎన్నికలు నిర్వహిస్తుంది అని బలంగా విశ్వసిస్తున్నా. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. సో ఎన్నికల కమిషన్ విశ్వసనీయత ఈ దేశంలో ప్రమాదంలో ఉంది. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత చాలా వేగంగా తగ్గుతూ వస్తుంది, ఈ నేపథ్యంలో బీహార్‌లో జరుగుతున్న వ్యవహారం చూసిన తర్వాత ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడానికి సంబంధించి, సూదులతో కాదు, గడ్డపారలతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీల వైపు నుంచి అనిపిస్తుంది, ఏంటది ఏం జరుగుతోంది, బీహార్‌లో సరిగ్గా ఇంకో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, అక్టోబర్-నవంబర్ లో ఎన్నికలు జరగాలి.
బీహార్‌లో ఇమ్మీడియట్ గా షెడ్యూల్ రాబోతుంది రేపో మాపో లాంటి వాతావరణం ఉంది. అక్కడ ఓటర్ల జాబితా సవరణ దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగిన చర్చ, ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన శైలి, వీటన్నిటిని పార్టీలు, వ్యక్తులు, సంస్థలు జర్నలిస్టులు మాత్రమే కాదు, సుప్రీం కోర్టు కూడా తప్పుపట్టడం చూశాం. ఇప్పుడు బీహార్‌లో అధికారికంగా, లీగల్ గా ఓట్ల కొనుగోలు జరుగుతోంది, ఓట్ల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. నరేంద్రమోదీ అధికారికంగా బీహార్‌లో ప్రజల డబ్బుతో, ప్రజల ఓట్లని కొనుగోలు చేయడానికి, సంబంధించిన పథకానికి నిన్న శ్రీకారం చుట్టారు. ఇంకొక నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్‌లో, దాదాపు 15-20 సంవత్సరాలుగా నితీష్ కుమార్ బీహార్ కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆల్మోస్ట్ టూ డెకేడ్స్ గా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనే కంటిన్యూ అవుతూ వస్తున్నారు, మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినప్పటికి 20 సంవత్సరాలుగా, లేని ఒక కార్యక్రమాన్ని నెల రోజులు పదవిలో నుంచి దిగిపోవడానికి, నెల రోజుల ముందు ఆయనక ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారం ఆ పథకానికి రూపకల్పన చేశారు. ఏంటి ఆ పథకం ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద మహిళలకు ఉపాధి కల్పించడం ఆ పథకం లక్ష్యం.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
