బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి తీసుకునే ఈ నిర్ణయం ఒక చారిత్రక నిర్ణయంగా కాంగ్రెస్ సర్కార్ చెప్తోంది. బీసీలకు మేము ప్రామిస్ చేసినట్లుగానే రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం, స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది. దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ ని తీసుకురాబోతున్నామని చెప్తుంది.

ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం ఇమ్మీడియట్‌గా 15 డేస్ లోనే రిజర్వేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కావాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న రాజకీయ పార్టీలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు నిజానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయాలి, పాలాభిషేకాలు చేయాలి, పూలతో కూడా అభిషేకాలు చేయాలి, కానీ బీసీ సంఘాలకు కావచ్చు, చాలా రాజకీయ పార్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంబరాలు చేసుకోలేకపోతున్నారు, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధితో చేసింది కాదు అనుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బీసీలకు రిజర్వేషన్లు ఎగ్గొట్టడం కోసం వేసిన ఒక ప్రణాళికగా ఎత్తుగడగా బీసీలు భావిస్తున్నారు. ఎందుకు 42% డిమాండ్ చేశారు. 42% ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అంటే.. బీసీ రిజర్వేషన్ల అంశం సంబంధించి ఉన్న వివాదం ఏంటంటే 50% స్లాబ్ ఉంది అందుకంటే, ఎక్కువ బీసీ రిజర్వేషన్లు ఉండకూడదు అనేది ప్రభుత్వం చెప్తున్న మాట, కోర్టులు చెప్తున్న మాట, రాజ్యాంగం చెప్తున్న మాట, నైన్త్ షెడ్యూల్ లో చేరిస్తే తప్ప రిజర్వేషన్ల పరిధి పెంచడానికి సంబంధించిన అవకాశం లేదు. ఒక తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం 50 %నికి పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి నైన్త్ షెడ్యూల్‌లో తమిళనాడుకి సంబంధించిన రిజర్వేషన్ అంశం ఉంది కాబట్టి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు.

ఈ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మేము శాస్త్రీయంగా వెళ్తున్నాం అంటూ రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడ్డ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. దానిలో భాగంగానే మేము శాస్త్రీయంగా కులగణన చేశాం, కులగణన చేసిన రిపోర్ట్ మా దగ్గర ఉంది దాన్ని బేస్ చేసుకొని మేము రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి మొత్తం దేశానికి ఒక దారి చూపించబోతున్నాం, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ దేశంలో కులగణన జరగలేదు, ఒక్క తెలంగాణ రాష్ట్ర సర్కార్ మాత్రమే చేసింది.

మేము కులగణన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామ అంటూ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పారు. నిజానికి నిన్న క్యాబినెట్ లో తీసుకున్న డెసిషన్ ప్రకారమే రిజర్వేషన్లు గనుక ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఎటువంటి హడిల్స్ లేకుండా, ఎప్పుడో క్యాబినెట్ లో పెట్టేసి ఆర్డినెన్స్ వేసేసి ఎన్నికలు కూడా నిర్వహించొచ్చు. స్థానిక సంస్థలకు సంబంధించిన గడువు ముగిసి ఎన్నికలు ఏడాది క్రితమే జరగాల్సి ఉంది. అప్పుడే ఆర్డినెన్స్ తెచ్చి వెళ్లొచ్చు, ఎందుకు వెళ్ళలేదు అంటే, మేము శాస్త్రీయంగా వెళ్ళదలుచుకున్నాం కాబట్టి వెళ్ళలేదు అని ప్రభుత్వం చెప్పింది. సో శాస్త్రీయంగా కులగణన చేసి, డెడికేటెడ్ బీసి కమిషన్ వేసి, ఆ కమిషన్ రిపోర్ట్ ని తీసుకొని ఇవన్నీ చేసి, మేము బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు.ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story