ఆంధ్రప్రదేష్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్య స్త్రీ సేవలను నిలిపి వేశాయి. 2700 కోట్ల రూపాయలు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది

ఆంధ్రప్రదేష్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్య స్త్రీ సేవలను నిలిపి వేశాయి. 2700 కోట్ల రూపాయలు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది, ఆ బకాయిలు రావట్లేదు బకాయిలు ఇవ్వకపోతే మేము ఆసుపత్రులు నడిపే పరిస్థితిలో లేము అని చాలా రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్ళారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మంత్రి సత్యకుమార్ త్వరలోనే వాళ్ళకు సంబంధించిన బకాయిలు అన్నిటినీ కూడా క్లియర్ చేస్తామంటూ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. వారాలు గడుస్తున్న ఇప్పటివరకు ఆ డబ్బులు రిలీజ్ చేయలేదు ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలని నిలిపి వేస్తున్నట్లుగా ప్రైవేట్ ఆసుపత్రులు ప్రకటించాయి. ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేయడం అనేది పేద ప్రజలకు ఆరోగ్యాన్ని దూరం చేయడం అవుతుంది.

ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేయడం కారణంగా కొత్తగా హాస్పిటల్‌కు వెళ్ళే వాళ్ళు మాత్రమే కాదు, ఇప్పటికే ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అయి ఉన్న వాళ్ళకి సంబంధించిన వైద్య సేవలకి కూడా అంతరాయం కలుగుతుంది. వాళ్ళంతా ఈ రోజు నుంచి డబ్బులు చెల్లించి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ లో అడ్మిట్ అయిన వాళ్ళు కావచ్చు, రకరకాల సర్జరీస్ కోసం అడ్మిట్ అయిన వాళ్ళు కావచ్చు, సర్జరీస్ అయిన తర్వాత ప్రొసీజర్ కోసం అక్కడే ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు నుంచి ఉంటుంది. ప్రభుత్వం అసోసియేషన్ తో, హాస్పిటల్స్ వాళ్ళతో ఇప్పటికే పలుదఫాలుగా చర్చలు జరిపినప్పటికీ, కనీసం కొంత అమౌంట్ అయినా రిలీజ్ చేసి వాళ్ళు సేవలను నిలిపి వేసే పరిస్థితి రాకుండా చూడాల్సి ఉంది. బట్ ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేసినట్టు కనపడలేదు, ఆ కారణంగానే ఆరోగ్యశ్రీ సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలిచిపోయినట్లుగా భావించాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ, తాజాగా మనమంతా మాట్లాడుకుంటున్న అంశం ప్రైవేటు వాళ్ళకు మెడికల్ కాలేజీలు అప్పగించే అంశం. ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలు అప్పగించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో, దాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.

పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, అది సరైంది కాదు అని చెప్తున్నాయి, ఎందుకు సరైంది కాదు అంటే ఇదిగో ఇందుకు కారణం, ప్రైవేట్ హాస్పిటల్‌కు ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లించలేదు అని వాళ్ళు సేవలు ఆపేస్తారు, ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్యంలో ఆసుపత్రులు ఉంటే జరిగేది ఇదే, ఈవెన్ ప్రభుత్వ రంగంలో ఉన్న ఆసుపత్రుల్లో అన్ని సర్వీసెస్ అక్కడే ఇచ్చి, డబ్బులు ఏదో అక్కడే ఖర్చు పెట్టి, అక్కడ అన్ని సర్వీసెస్ దొరికేలా చేస్తే బాగుంటుంది తప్ప, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది, మేము ఇప్పుడు ఆరోగ్య స్త్రీకి సంబంధించిన లిమిట్ ని 25 లక్షలు చేశాం. 25 లక్షలు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వమే కడుతుంది, అది ప్రైవేట్ గా ఏం ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు మెరుగైన వైద్యం అక్కడ దొరుకుతుంది అని కొంతమంది మేధావులు చెప్తున్నారు. ఆ మేధావులు గమనించాల్సింది ఏంటంటే, ఆ ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం గనుక డబ్బులు ఇవ్వడం ఆపేస్తే సేవలు ఆగిపోతాయి. సేవలు ఆగిపోవడం కారణంగా ప్రాణాలు ఆగిపోతాయి, ప్రాణాలు ఆగిపోవడం కారణంగా కొన్ని కుటుంబాలు కూలిపోతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story