Medical Colleges Issue: బాబుగారూ.. మీకు అర్థమవుతోందా..!
Medical Colleges Issue: బాబుగారూ.. మీకు అర్థమవుతోందా..!
ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశం, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం, ఆంధ్రప్రదేశ్‌లో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన, పిల్లల వైద్య విద్యకు సంబంధించిన అంశం, కాబట్టి ఏపీ సీఎం చంద్రబాబుకు మరోసారి విజ్ఞప్తి చేయదలుచుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా ప్రైవేట్ కు మెడికల్ కాలేజీలను అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇస్తే పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేసినట్లు అవుతుంది. పేద విద్యార్థులకు రిజర్వేషన్ కోటాలో సీట్లు తీసుకొని వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ద్రోహం చేసినట్లు అవుతుంది, ఆ పని చేయకండి అంటూ రాష్ట్రంఅంతా కోరుతుంది. చంద్రబాబు నాయుడుకి వినపడుతున్నట్లు కనపడట్లా, ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి అయ్యే ఖర్చు నాలుగు, ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే, ఆ నాలుగు, ఐదు వేల కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా ఈ రోజుకి ఈరోజు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ ప్రభుత్వం, దాన్ని నిర్మించాలంటే ఓ 10 ఏళ్లో, 15 ఏళ్లో, 20 ఏళ్లో పడుతుంది అంటూ మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అమరావతి లాంటి చోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కరేడులో ఇండోసోల్ అనే ఒక కంపెనీ అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడానికి సంబంధించి ముందుకు వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి ఇస్తున్న ఇన్సెంటివ్స్ విలువ 41వేల కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో అనేక కంపెనీలకు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని రూపాయికి, రెండు రూపాయలకి కట్టబెట్టేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదని ప్రైవేట్ కంపెనీలకు దోచేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదని ఆదానీలకు, అంబానీలకు దోచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులతో ఆర్భాటంగా పెద్ద పెద్ద నిర్మాణాలు ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలకు సంబంధించిన మెడికల్ కాలేజీలకు నాలుగు, ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి అంటే ఎందుకు మీ చెవులోకి ఆ మాట వెళ్ళట్లేదో అర్థం కావట్లేదు, ఇక్కడ మీ సమస్య నాలుగు,ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఇబ్బంది అని మాత్రం కాదు, మీరు ఎవరికో ప్రామిస్ చేశారు ఆ కాలేజీని ఇస్తామని, మీరు ఎవరికో లబ్ది చేయకూరుస్తామని హామీ ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకోవడం కోసం 4వేల కోట్లు, 5000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితిలో లేదు అని సాకులు చెప్తున్నారు, వంకలు చెప్తున్నారు. మీ కళ్ళ ముందు ప్రస్తుతం ప్రత్యక్షంగా ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఆరోగ్య స్త్రీ సేవల్ని నెట్వర్క్ ఆసుపత్రులు ఆపేశాయి. ఓపి సేవలు నిలిచిపోయాయి, ఆరోగ్యశ్రీ పథకం ఎందుకు వచ్చింది అంటే, ప్రభుత్వ ఆసుపత్రలలో సౌకర్యాలు లేక, స్టాఫ్ లేక క్వాలిటీ సిబ్బంది లేని కారణంగా పేదలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే ఎఫర్ట్ చేయలేని వాళ్ళంతా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు, కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ ట్రీట్మెంట్ కి సంబంధించిన డబ్బుల్ని ప్రభుత్వమే చెల్లించేలా తీసుకొచ్చిందే ఆరోగ్యశ్రీ పథకం. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
