Journalist YNR : వీరిద్దరికీ కూడా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుతారా..!
ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కార్పైన ఎవరైనా విమర్శ చేస్తే కేసులు పెడతాం, ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కార్‌కు ఎవరైనా సలహా ఇచ్చినా సహించలేం

ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కార్పైన ఎవరైనా విమర్శ చేస్తే కేసులు పెడతాం, ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కార్‌కు ఎవరైనా సలహా ఇచ్చినా సహించలేం, ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కార్‌కు ఎవరైనా వ్యతిరేకంగా, ఎవరైనా ఒక పోస్ట్ పెడితే కేసులు పెడతాం, ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా పోస్టులు ఎవరైనా పెడితే, ఆ పోస్టులను ఇంకెవరైనా షేర్ చేస్తే కూడా కేసులు పెడతాం, అంతే కాదు వాట్సాప్‌లో స్టేటస్ పెట్టినా కేసులు పెడతాం, ఇంటికి వచ్చి కొడతాం, చాలా ఘటనలు చూశాం. నేను ఇప్పుడు చెప్పిన ఈ సందర్భాలను బేస్ చేసుకొని పెట్టిన కేసులు ఈ సందర్భాలను బేస్ చేసుకొని, ఆంధ్రప్రదేష్‌లో జరిగిన ఘటనలు అనేకం చూశాం. కానీ కొద్దిమంది విషయంలో మాత్రం కూటమి సర్కారు ఎందుకో ఇంకా ఆలోచిస్తోందా, లేకపోతే మనవాళ్లే కదా పర్వాలేదు అనుకుంటుందో తెలీదు, ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కారు తప్పులు చేస్తోంది. ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం తప్పు, ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కారు, తెలుగుదేశం పార్టీ ఇలా వ్యవహరించి ఉండాల్సింది కాదు, దీని ద్వారా ప్రజలకు నష్టం జరుగుతుంది అని ఎవరైనా మాట్లాడితే, రాజకీయ పార్టీలు మాట్లాడడం వేరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టో, కమ్యూనిస్టులో, కాంగ్రెస్‌వాళ్లో మాట్లాడడం వేరే, మాలాంటి జర్నలిస్టులు ఎవరైనా మాట్లాడినా, న్యూట్రల్స్ ఎవరైనా మాట్లాడినా, మేధావులు ఎవరైనా మాట్లాడినా, ప్రొఫెసర్స్ ఎవరైనా మాట్లాడినా, వాళ్ళందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పడం అలవాటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ.
తెలుగుదేశం పార్టీ వికృత మీడియా. తెలుగు దేశం పార్టీకి సంబంధించిన మీడియా, తెలుగు పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, కూటమికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అంటూ కండువాలు కప్పి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ వచ్చింది. చాలా సందర్భాలుగా, చాలా సంవత్సరాలుగా చేస్తూ వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇంకా వికృతంగా చేస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని, మాలాంటి వాళ్ళని, అనేకమంది ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని, ఇతర పార్టీలలో ఉండి, కూటమి సర్కారు చేస్తున్న తప్పులని మాట్లాడిన వాళ్ళని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు అంటూ మాట్లాడడం మొదలు పెట్టింది. జడ శ్రవణ్ కుమార్, జై భీం భారత్ పార్టీ అధ్యక్షుడు, జడ శ్రవణ్ కుమార్ ప్రభుత్వాన్ని తప్పుపడితే కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారు అంటూ మాట్లాడడం మొదలు పెట్టింది. విజయ్ కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ఆయన ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడితే కూడా ఆయనకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిస్తోంది, ఆడిస్తోంది అంటూ ఒక క్యాంపెయిన్ ని మొదలు పెట్టింది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


