ఆంధ్రప్రదేశ్‌ రాజధాని రగడ.. ఎడతెగని పంచాయతీ..!

ఏపీ రాజధాని అమరావతి అంశానికి సంబంధించి మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ రచ్చ చూస్తున్నాం. రాజకీయ రగడ చూస్తున్నాం. అమరావతికి సంబంధించి 2024 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి అమరావతి పాలిట విలన్, మిగతా అన్ని పార్టీలు, అమరావతి కోసం పోరాడుతున్న పార్టీలుగా కనపడ్డాయి. అమరావతి రాజధాని ఒక్కటిగా ఉండాలంటూ, అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు ఆందోళన చేయడం, దీక్షలు చేయడం, ర్యాలీలు చేయడం చూశాం. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి ముందు కూటమి ఇచ్చిన హామీ అమరావతి ఒక్కటిగానే ఉంటుంది. అమరావతి అభివృద్ధి మా ఎజెండా అంటూ అధికారంలోకి వచ్చాయి. మూడు రాజధానులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు, మాండేట్ చూస్తే అది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అంశంలో చాలా వేగంగా ముందుకు వెళ్తామని చెప్పారు. అప్పులు తీసుకొస్తున్నారు, 32 వేల కోట్ల రూపాయలకు పైగా పనులు పిలిచారు, టెండర్లు పిలిచారు, పనులు నడుస్తున్నాయి, అదే సందర్భంగా రెండు సీజన్స్ లోనూ, మొదటి సీజన్లో రెండో సీజన్ లోనూ, వర్షాకాలంలో అమరావతి ప్రాంతం పూర్తిగా నీటిలో మునిగిపోవడం కనిపించింది. అమరావతి ప్రాంతంలో నీటిని తోడడం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కనిపించింది. ఇది కనిపించిన తర్వాత నీటితో మునిగిపోయే ప్రాంతంలో రాజధాని అవసరమా అనే మాటలు వినిపించాయి. ప్రభుత్వం మాత్రం వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితిలో పూర్తి చేస్తాం, దీనికోసం మరొక 30,000 కోట్ల రూపాయలు, ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలు సమీకరణ చేశారు, మరో 30,000 కోట్ల రూపాయలు సమీకరణ చేయబోతున్నాం, దాదాపు లక్ష కోట్ల రూపాయలతో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామంటూ కమిటెడ్ గా చెప్తూ వస్తుంది. ఎన్నికల కంటే ముందు చెప్పిన మాట ప్రకారం అమరావతి ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చేసే కార్యక్రమంలో వేగంగా ముందుకు వెళ్తున్నట్టుగా, కూటమి సర్కార్ చెప్తూ వస్తుంది. కూటమి సర్కార్ వైపు నుంచి ఉన్న మాట ఇది. అదే సమయంలో కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చెప్పిన మాట, ఇప్పుడు ఉన్న ప్రాంతంలో 33వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తే, లక్ష కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడితే, ఇది కేవలం మున్సిపాలిటీగా ఉంటుంది. అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఒక కొత్త మాటని తెరపైకి తీసుకొచ్చారు. ఈ మాట ఎన్నికలకు ముందు చెప్పింది కాదు, నిజానికి ఎన్నికల కంటే ముందు 2014-19 మధ్యలో చంద్రబాబు మాట్లాడిన మాట అప్పుడే తీసుకున్న ల్యాండ్ తోటే, అప్పుడే కట్టబోతున్న ప్రణాళికలతోటే ఆ ప్రాంతం ఆ రాజధాని ఒక అంతర్జాతీయ నగరంగా మారబోతుంది, విశ్వ రాజధానిగా, విశ్వనగరంగా మారబోతుంది అంటూ ఆయన మాట్లాడారు. అదే సందర్భంలో తీసుకున్న భూమిలో 50,000 ఎకరాల ప్రభుత్వ భూమి, రైతుల దగ్గర నుంచి తీసుకున్న మొత్తం భూమి, కలిపి దాదాపు 50,000 ఎకరాలు ఉంటే, ఈ 50,000 ఎకరాలని అభివృద్ధి చేస్తే ఇందులో 10,000 ఎకరాలు డెవలప్మెంట్, డెవలప్డ్ ల్యాండ్ మనకి మిగులుతుంది, ఈ 10వేల ఎకరాలని అమ్మితే లక్ష కోట్ల రూపాయలు వస్తుంది, ఇదొక సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అంటూ చెప్తూ వచ్చారు. ఇప్పుడు సెల్ఫ్ సస్టైన్ రాజధాని, విశ్వనగరం అని మాట్లాడిన మాటలన్నీ పక్కక వెళ్ళిపోయి, చంద్రబాబు నోటి వెంటే ఇప్పుడున్న పరిస్థితిలో దాన్ని డెవలప్ చేస్తే మునిసిపాలిటీ గానే మారిపోతుంది అంటూ మాట్లాడారు. ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి, అమరావతి రాజధానిగా ఉండాలి అని వాళ్ళని సమర్ధిస్తూ వస్తున్న అన్ని రాజకీయ పార్టీలు, ఈరోజు చంద్రబాబు మాటని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేవు. చంద్రబాబుతో పాటు కూటమిలో ఉన్న జనసేన కూడా నేరుగా మేము భూసేకరణను అంగీకరిస్తున్నామ అనే మాట చెప్పలేకపోతుంది. రాజధాని రగడపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story