Amaravathi Capital: అమరావతికి అన్న లక్షల కోట్లా..! వైఎస్‌ జగన్‌ సంచలన విమర్శలు..!

అమరావతిలో నిర్మాణాలు చేస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 36 వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. పనులు మొదలయ్యాయి, మరి కొన్ని వేల కోట్ల రూపాయలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అదనపు భూసేకరణ, రెండో విడత భూసేకరణ చేస్తున్నారు. భవిష్యత్తులో మూడో విడత భూసేకరణ కూడా చేస్తామని చెప్తున్నారు. 28 నాటికి, 29 నాటికి ఆల్మోస్ట్ రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్తున్నారు, ప్రతి ఏటా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ నాలుగేళ్లలో పూర్తి చేస్తామంటూ గతంలో మంత్రి నారాయణ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఎస్టిమేట్స్ పెరుగుతూ వచ్చాయి. ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వం చివరినాటికి అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి మద్దతుగా గడిచిన ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేశారు. ఆ ప్రాంత ప్రజలు చేసిన పోరాటానికి ప్రజలు మద్దతుగా నిలిచారు. కూటమి సర్కార్ కూడా అమరావతి రాజధాని నిర్మాణాన్ని తమ ప్రయారిటీగా చెప్తూ వచ్చింది. ఆ ప్రయారిటీలో భాగంగానే దానికి నిధులు ఇవ్వడం కావచ్చు, అక్కడ పనులకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కావచ్చు చూస్తూ ఉన్నాం. అమరావతి ప్రాంతాంలో నిర్మాణాలపైన ఆ ప్రాంతంలో రాజధానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంపైన, ప్రతిపక్ష పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, రాజధాని నిర్మాణం ఎలా అయినా, రూపాయి ఎక్కువ ఖర్చు అయినా, సరే కంప్లీట్ అయితే బాగుంటుంది లాంటి ఒపీనియన్ వైడర్‌గా, జనరల్‌గా ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడిన కొన్ని మాటలు, గతంలో వచ్చిన కొన్ని కథనాలు చూసిన తర్వాత, అమ్మో అమరావతికి అంత ఖర్చు పెడుతున్నారా అనిపిస్తుంది. అమరావతికి ఆ స్థాయిలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది. అమరావతిలో రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టడం, రాష్ట్రంపైన బర్డెన్ అని విమర్శలు వచ్చిన సందర్భంగా, 2014-19 మధ్యలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చెప్పిన మాట అమరావతి ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్రానికి బర్డెన్ కాదు, అక్కడ మేము తీసుకున్న భూములు, ప్రభుత్వ భూములు, మేము సేకరించిన భూములు అన్నీ కలిపి 50,000 ఎకరాలు ఉన్నాయి. ఈ 50,000 ఎకరాలని మేము డెవలప్ చేస్తే 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ మాకు మిగులుతుంది ఈ 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకుని అమ్మితే లక్ష కోట్ల రూపాయలకు పైగా డబ్బులు వస్తాయి, మేము పెట్టే ఖర్చు అమరావతిలో లక్ష కోట్ల రూపాయలు ఉండదు, అడిషనల్ గా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్ లా పనిచేస్తుంది. అమరావతి ద్వారా రాష్ట్రానికి డబ్బులు వస్తాయి తప్ప, అమరావతి రాష్ట్రానికి భారంగా మారదు అని చెప్తూ వచ్చారు. ఈ అంశంపై పూర్తి విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story