అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అవసరం లేదు

అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అవసరం లేదు, ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతిగా ఉండాలి, అమరావతిలో రాజధానిని నిర్మిస్తామంటూ 2014-19 మధ్య అప్పటి సర్కారు రైతుల నుంచి భూములను సమీకరించింది. సమీకరించి అక్కడ రాజధాని నిర్మాణ పనులు మొదలు పెట్టింది. అక్కడ రాజధాని నిర్మాణం తర్వాత, రైతుల నుంచి తీసుకున్న భూముల్లోనూ, ప్రభుత్వానికి సంబంధించిన భూములు, అసైండ్ భూములు వీటన్నిటిలోనూ వేల ఎకరాల భూమి మిగులుతుంది, ఆ భూమిని వేలం వేస్తే, ఆ భూమిని అమ్మితే లక్ష కోట్ల రూపాయలు వస్తాయి కాబట్టి, అమరావతిలో మేము నిర్మించబోయేది, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ, అమరావతి నిర్మాణం అనేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు ఏమాత్రం కూడా భారంగా ఉండదు అని అప్పటి ప్రభుత్వం చెప్పింది. అంతేకాదు ఇదొక ఇంటర్నేషనల్ సిటీగా మార్చబోతున్నాం, ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా దీన్ని మార్చబోతున్నాం అంటూ కూడా 2014-19లో చెప్పింది.

అప్పుడు ప్రభుత్వం మాట విని ప్రతిపక్షం కూడా అమరావతినే రాజధానిగా ఉంచాలని అప్పుడే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రైతులు ధైర్యంగా భూములని ఇచ్చారు. ప్రభుత్వాలను నమ్మి రాజధాని నిర్మాణాన్ని 10 ఏళ్ల లోపు పూర్తి చేస్తాం, పూర్తి చేయడం మాత్రమే కాదు, రైతులకు అప్పటివరకు కౌలు ఇస్తాం, రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తాం అంటూ అప్పుడు ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం చెప్పిన మాట నిజం కాలేదు. మధ్యలో ప్రభుత్వం మారింది, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి మా విధానం కాదు అన్నారు, ఆయన మూడు రాజధానులు అన్నారు, అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రమే అన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు కావాలి, లక్ష కోట్ల రూపాయలు పెట్టే పరిస్థితిలో ఈ సర్కారు లేదు అంటూ అప్పుడు ఆయన చెప్తూ వచ్చారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టాల్సిన అవసరమే లేదు, మౌలిక సదుపాయాలు కల్పించినా అమరావతి డెవలప్ అయిపోతుంది. రెండు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అమరావతి డెవలప్ అయిపోతుంది. మూడు రాజధానులు అనే మాట మాట్లాడకండి, ఇక్కడ కొద్దిగా రోడ్లు వేసి కాస్త డెవలప్ చేసినా ఈ ప్రాంతం డెవలప్ అయిపోతుంది అంటూ అప్పుడు అమరావతి ఉద్యమాన్ని మద్దతు ఇస్తున్న వాళ్ళు, ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న వాళ్ళంతా మాట్లాడుతూ రావడం చూశాం.

అప్పుడు వైసార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రైతుల పాలిట శత్రువుగా ఉండటం చూశాం. అమరావతి రైతులు అప్పటి వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడం చూశాం. దీక్షలు చేయడం చూశాం. పాదయాత్రలు చేయడం చూశాం. అమరావతి రైతులు ఆందోళన అప్పటి సర్కార్ కి ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. రాజధానులు మార్చడాన్ని ప్రజలు అంగీకరించలేదనే విషయం ఎన్నికల ఫలితాల తర్వాత తేటతెల్లమైంది. ఎన్నికలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కారు అమరావతి పాలిట విలన్ కాదు, అమరావతి పాలిట విలన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ విలన్ ని ఇంటికి పంపించేశాం. ఇక అమరావతికి ఎటువంటి డోకా ఉండదు అని అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావించారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది, ఎవరినైతే హీరోగా భావించామో వాళ్లే శత్రువుగా మారిపోయారా.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వైఎన్‌ఆర్ విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story