Journalist YNR : లోక్ష్కు ఓ అవకాశం వచ్చింది.. ఏంటా అవకాశం..!
నేతల నోటి దూల చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం మనం, రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, ప్రత్యర్ది పార్టీలపైన, ప్రత్యర్థులపైన నోటి దూలతో చెలరేగిపోవడం చాలా సందర్భాల్లో చూస్తున్నాం.

నేతల నోటి దూల చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం మనం, రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, ప్రత్యర్ది పార్టీలపైన, ప్రత్యర్థులపైన నోటి దూలతో చెలరేగిపోవడం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేష్‌కి సంబంధించిన అటువంటి నోటిదూల నాయకుల లిస్ట్ చదివితే చాంతాడంత ఉంటుంది, తెలంగాణలో కూడా అటువంటి నాయకులు కొంతమంది మోపోయారు, సో ఈ నాయకుల నోటి దూల చాలా సందర్భాల్లో పార్టీలకు, పార్టీ అధిష్టానాలకు తలనొప్పులు తెస్తూ వస్తుంది, కొన్ని సందర్భాల్లో పార్టీలు, పార్టీ నాయకత్వాలు ఇటువంటి నోటి దూల నాయకుల్ని వదిలించుకునే అవకాశం కూడా ఇస్తుంది. సో తెలుగుదేశం పార్టీకి అటువంటి ఒక అవకాశం ఇప్పుడు వచ్చింది, గత వైసీపీ సర్కార్ హాయంలో కొంతమంది బూతులు మాట్లాడారంటూ, కొంతమంది నేతల పేర్లే బూతు నేతలుగా మారిపోయాయి, సో గత ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణిని ఉద్దేశించి కొంతమంది వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేశాయి, నైతికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చేయలేని పరిస్థితిని క్రియేట్ చేశాయి.
ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం, ఎవరు మాట్లాడారు , ఎక్కడ మాట్లాడారు ఎవిడెన్స్ ఏంటంటే పక్కన పెడితే, అటువంటి వ్యాఖ్యలు చేసిన నాయకులు తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు, సో ఇప్పుడు టిడిపి అధికారంలో ఉన్న సందర్భంగా, కూటమి అధికారంలో ఉన్న సందర్భంగా, కొద్ది రోజుల క్రితం ఓ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త ,మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమని ఉద్దేశించి నోటి దూలతో కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యల పైన ఇమ్మీడియట్ గా ప్రభుత్వం స్పందించింది, అతన్ని అరెస్ట్ చేసింది. సో మేము చాలా సీరియస్ గా ఉంటాం, మహిళలకు అన్యాయం జరిగితే, మహిళలు ఎవరైనా కించపరిస్తే, మేము చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం అంటూ ప్రభుత్వం ప్రకటించింది.
తన తల్లిని ఇటువంటి వ్యాఖ్యలు చేశారు కొంతమంది వ్యక్తులు, ఆ సందర్భంగా నేను ఏ స్థాయిలో బాధపడ్డానో తెలుసు కాబట్టి, ఆంధ్రప్రదేష్‌లో ఇంకో తల్లికి ఇటువంటి పరిస్థితి రానివ్వను, ఇంకో తల్లి ఎవరు ఇటువంటి పరిస్థితిలో ఉండకూడదు, అని నారా లోకేష్ చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేష్‌లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇటువంటి నోటి దూల వ్యాఖ్యలు చేశారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి, ఆయన తల్లిని ఉద్దేశించి, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడిన మాటలు ఏమాత్రం కూడా ఎవరూ సహించేవి కాదు, ఆయన సినిమాకు వ్యతిరేకంగా, ఆయన సినిమాని ఆడకుండా చూడటంలో భాగంగా, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన ప్రయత్నాలు ఆ ఆడియోలో మనకి వినపడుతున్నాయి.
లోకేష్ కు వ్యతిరేకంగా ఎలా ఉంటాడు, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలా ఉంటాడు, వాడిని, వాడి సినిమాల్ని ఆడనీయం, సినిమా ఆడదు అంటూ అహంకారపూర్వతంగా ఆయన మాట్లాడడం విన్నాం. నేను ఈ నియోజక వర్గ ఎమ్మెల్యే నిచ, నియోజక వర్గ ఎమ్మెల్యే అంటే నియోజక వర్గాన్ని వాళ్ళకి రాసి ఇచ్చేశారా, సామంత రాజ్యాలా, అక్కడ ఎవరు సినిమా ఆడించాలన్నా, అక్కడ ఎవరు వ్యాపారం చేయాలన్నా, అక్కడ బతకాలన్నా, ఎవరన్నా ఎమ్మెల్యేల పర్మిషన్ అవసరం ఉంటుందా, రాజ్యమా, సామంత రాజులా మీరు. ఏంటంత అహంకారం, ఏమన్నాడు జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ ని 20 ఏళ్లుగా రాజకీయాలని అబ్సర్వ్ చేస్తున్నా, నేను ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేషన్ ఉద్దేశించి ఏదైనా మాట్లాడడం వినలా చూడలా కనపడలే. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
