గత ప్రభుత్వంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మహిళల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.

గత ప్రభుత్వంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మహిళల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. కొంతమంది నాయకులు మాట్లాడిన భాష వైసీపీని ప్రజలకు దూరం చేసింది. కొంతమంది మాట్లాడిన మాటలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేశాయి. సో ఆ సమయంలో మహిళల పట్ల అప్పటి ప్రతిపక్ష పార్టీ చాలా కన్సర్న్ చూపిస్తూ వచ్చింది. మహిళల గురించి ఇలా మాట్లాడితే ఎలా. అలా మాట్లాడితే ఎలా, మరి ఇలా చేస్తారా అంటూ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వచ్చింది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధినేత సతీమణి గురించి మాట్లాడిన మాటలు చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. నా గురించి తప్పుగా మాట్లాడారు అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి సతీమణి రాష్ట్రమంతా తిరిగి నాకు న్యాయం చేయండి అంటూ కోరింది.

ఓ వ్యక్తి ఆమె గురించి తప్పుగా మాట్లాడారంటూ ఆమె హర్ట్ అయి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి, ప్రజలను చైతన్యం చేసి నాకు అన్యాయం జరిగింది అంటూ ప్రజల దగ్గరికి వెళ్ళింది. కూటమి అధికారంలోకి వచ్చింది, మహిళల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకి అది చివరి రోజు అంటూ ముఖ్యమంత్రి ఒక 15 సార్లు ప్రకటించారు, ఇప్పటికి ఓ తల్లికి పట్ల, ఓ తల్లి పట్ల తప్పుడుగా మాట్లాడిన వ్యక్తి, ఇప్పుడు ఎటువంటి శిక్ష అనుభవిస్తున్నారో చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో మహిళల గురించి ఎవరు మాట్లాడినా ఇదే పరిస్థితి కల్పిస్తాం, ఈ రాష్ట్రంలో మహిళలందరినీ నా తల్లిలాగే చూసుకుంటాను, నా తల్లికి జరిగిన అవమానం ఈ రాష్ట్రంలో మా పాలనలో ఇంకెవరికీ జరగనివ్వను, ఓ యువనాయకుడు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ప్రకటనలు ఇవి. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మదమెక్కి, నోటి దూలతో , మళ్ళీ రిపీట్ చేస్తున్నా మదమెక్కి నోటి దూలతో, విచక్షణ కోల్పోయి అహంకారంతో నియోజక వర్గానికి ఒక సామంత రాజులా బలుపెక్కి మాట్లాడితే, ఆ మాటలు విస్తృతంగా ప్రజాబాహుల్యంలో ఉంటే, ప్రభుత్వం స్పందించిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరు ఏమాత్రం సమంజసంగా లేదు. ఇదంతా ఆడియో బయటికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఓ నిమిషం వీడియో రిలీజ్ చేసి అది నేను కాదు అయినా సారీ చెప్తున్నాను అంటూ చేతులు దులిపేసుకున్నారు.

చేతులు దులిపేసుకున్న ఆ ఎమ్మెల్యే కాల్ లిస్ట్‌ ఎమ్మెల్యే తో మాట్లాడిన వ్యక్తి కాల్ లిస్ట్ చూస్తే అర్థంవుతుంది, ఎఫ్ఎస్ఎల్ కి మొత్తం వాయిస్ ని పంపించి టెస్ట్ చేసేదాకా అవసరం లేదు, కాల్ లిస్ట్ చూస్తే అర్థమవుతుంది, అని నాలాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత, ప్రభుత్వానికి తెలిసి వచ్చింది, తప్పు జరిగిపోయింది మన ఎమ్మెల్యే తప్పుగా మాట్లాడాడు అన్న విషయం అర్థమైంది, అర్థమైన తర్వాతయనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, యాక్షన్ తీసుకుంటుంది అని అనుకున్నాం కానీ, ప్రభుత్వం వైపు నుంచి చిన్న చిన్న లీకులు వచ్చాయి, సొంత ఛానల్స్ కి ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు, దీని మీద సీరియస్ అయ్యారు, ముఖ్యమంత్రి 15 రోజుల క్రితం గుంటూరు ఎమ్మెల్యే ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్న అంశానికి సంబంధించి నిన్న సీరియస్ అయ్యారంట, ముఖ్యమంత్రి అనంతపురం ఎమ్మెల్యే పైన కూడా నిన్న సీరియస్ అయ్యారట, నాలుగైదు ఇష్యూస్ కలిపి, నలుగురు, ఐదు ఎమ్మెల్యేల పైన కలిపి వాళ్ళకు సంబంధించిన మొత్తం వ్యవహారాలను కలిపి, నిన్న ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని ఒక లీక్ ఇస్తారా, నారా లోకేష్ మాతృమూర్తికి జరిగిన అవమానం, జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తికి జరిగిన అవమానం ఒకటి కాదా? సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


ehatv

ehatv

Next Story