ఆంధ్రప్రదేశ్‌లో సంపదను పెంచుతాం, పేదలకు పంచుతాం, పేదల బతకుల్లో మార్పుతెస్తామని, సంపదను పెంచి పేదలకు పంచుతామని ఏపీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో సంపదను పెంచుతాం, పేదలకు పంచుతాం, పేదల బతకుల్లో మార్పుతెస్తామని, సంపదను పెంచి పేదలకు పంచుతామని ఏపీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. చంద్రబాబు హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ (AP)అప్పుల్లో కూరుకుపోయిందని, అప్పులను ఇచ్చేందుకు ముందుకు రావడానికి ఎవరూ రావడంలేదన్నారు. ఆస్తులను తాకట్టు పెట్టి గత ప్రభుత్వం అప్పులు తెచ్చిందని ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ (Land Tittle ACT)పేరుతో ప్రజల భూములను గుంజుకుంటుందని.. మరోసారి జగన్‌(Ys jagan)కు ఓటు వేస్తే ప్రజల భూములను కూడా తాకట్టు పెడతారని ప్రచారం చేశారు. దీంతో ప్రజలు టీడీపీ(TDP) వాగ్దానాలను నమ్మిఓటేశారు. టీడీపీ చెప్పిన భయాలకు భయపడి ప్రజలు ఓటు వేశారు. అయితే 2014 నుంచి 2024 వరకు పదేళ్ల కాలంలో ఒక్క ఏడాది కాలంలో చంద్రబాబు(Chandrababu), జగన్‌ చేయని అప్పులను ఈ 11 నెలల కాలంలో చేశారు. ఏడాది కాలంలో ఎవరూ చేయనన్ని అప్పులను కూటమి సర్కార్ చేసింది. ఈ ఒక్క ఏడాదిలో లక్షా 32 వేల కోట్ల అప్పులు చేసింది. గడిచిన పదేళ్లలో ఒక ఏడాదిలో లక్షా 32 వేల కోట్లు అప్పు చేయడం గమనార్హం. ఈ స్థాయిలో అప్పులు చేసినా ఎన్నికల హామీలను నెరవేర్చలేకపోయారు. ఎన్నికల సమయంలో 14 లక్షల కోట్ల అప్పు ఉందని.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడు లక్షల కోట్లని అసెంబ్లీలో చెప్పింది. అయితే హామీలు అమలు చేయలేకపోయినా ఈ డబ్బంతా ఏటు పోతుంది.. ఏం చేస్తున్నారు.. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..



Updated On
ehatv

ehatv

Next Story