Yanamala Rama Krishnudu : ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై 'యనమల' మాట అయినా వినరా..!
ఆంధ్రప్రదేష్‌లో పీపీపీ పద్ధతిలో కాలేజీలను, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సరైంది కాదు.

ఆంధ్రప్రదేష్‌లో పీపీపీ పద్ధతిలో కాలేజీలను, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సరైంది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ముక్తకంఠంతో చెప్తున్న మాట, పార్టీలకు అతీతంగా పీపీపీకి వ్యతిరేకంగా అనేకమంది మాట్లాడుతూ వస్తున్నారు. పీపీపీ పద్ధతిలో కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే ప్రజల ఆరోగ్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడమే ప్రజలను ముక్కుపిండి వసూలు వసూలు చేసే అవకాశాన్ని ప్రైవేట్ కాలేజీలకి ఇవ్వటమేనని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, 17 మెడికల్ కాలేజీలని గత ప్రభుత్వం తీసుకొస్తే, అందులో ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పటికే రెండు సంవత్సరాలుగా అడ్మిషన్స్ కూడా జరుగుతుంటే, మరికొన్ని మెడికల్ కాలేజీలకు భూములు కేటాయింపు జరిగి, అడ్మిషన్స్ ఆ దానికి సంబంధించిన నిర్మాణాలు కూడా పూర్తవుతుంటే, వాటిని మేము నిర్మించలేం, మా దగ్గర 4000 కోట్లో, 5000 కోట్లో డబ్బులు లేవు కాబట్టి మేము వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుంది. దీనిని ప్రశ్నించాల్సిన మీడియా, ఇది తప్పు అని చెప్పాల్సిన మీడియా, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పాల్సిన మీడియా, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని సమర్థిస్తుంది.
ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల జరిగే నష్టం ఏంటి, విద్యార్థులు సీట్లు కోల్పోతారు, కేవలం డబ్బు ఉన్న వాళ్ళకు మాత్రమే మెడికల్ సీట్లు దొరుకుతాయి, దీనిపైన ఎవరికైనా డౌట్లు ఉంటే ఇంకా చాలా సమాచారం చెప్పగలను. ప్రైవేటు కాలేజీలుగా అవి ఉంటాయి కాబట్టి, అక్కడికి వైద్యం కోసం వెళ్ళాలంటే, రకరకాల టెస్టుల పేరుతో, వైద్యం పేరుతో, ప్రజలని దోపిడికి గురి చేస్తారు, దశాబ్దాల పాటు పైగా ఈ కాలేజీలు నిర్మించిన తర్వాత, 66 సంవత్సరాల పాటు ఈ కాలేజీలు, ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే ఉంటాయని ప్రభుత్వం చెప్తోంది. తాజాగా రెండు రోజుల క్రితం ప్రభుత్వం తీసుకున్న మరొక నిర్ణయం, మా కాలేజీలకి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ పేర్లు కూడా పెట్టొచ్చు, ప్రైవేట్ వైద్య కళాశాల అని కింద ఎవరైతే తీసుకుంటారో, వాళ్ళ పేర్లు కూడా పెట్టొచ్చు అని అప్పుడు అవి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అవుతాయి తప్ప, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎందుకు అవుతాయి, ఆ కాలేజీలో ఉన్న హాస్పిటల్‌కు వెళ్ళిన ప్రజలు ఒక్క రూపాయి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అని, చెప్పగలుగుతుందా ప్రభుత్వం డెఫినెట్ గా నో ప్రభుత్వం చెప్తున్న కారణ సహితికంగా లేదు ఫస్ట్ ఏం చెప్తుంది ప్రభుత్వం ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవు అని చెప్తుంది.
గోదావరి పుష్కరాలకి 5300 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తుంది, గోదావరి పుష్కరాల కోసం 5000 కోట్లు ఖర్చు చేయడానికి డబ్బులు ఉన్నాయి, అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేయడానికి డబ్బులు ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీలకు 40,000 కోట్లు, 50,000 కోట్లు ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, రాష్ట్ర సంపదని రూపాయికి 90 పైసలకి ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టడానికి డబ్బులు ఉన్నాయి, ప్రైవేట్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకి భూములు ఇవ్వడానికి మీ దగ్గర భూములు ఉన్నాయి, ఎవడో కంపెనీ పెట్టుకోవడానికో ఎవడో మాల్ పెట్టుకోవడం కోసం విజయవాడ నడిబొట్టిన భూములు ఇవ్వడానికి మీ దగ్గర మనసు ఉంది కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇవ్వకుండా ప్రభుత్వ రంగంలో వాటిని నిర్మించడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు లేవు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


