Amaravati : అమరావతికి.. మరో 32 వేల కోట్ల అప్పు
రాజధాని అమరావతి కోసం మరో 32వేల కోట్ల రూపాయలు అప్పులు సమీకరించబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

రాజధాని అమరావతి కోసం మరో 32వేల కోట్ల రూపాయలు అప్పులు సమీకరించబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సీఆర్డీఏ దీనికి సంబంధించి 32వేల కోట్ల రూపాయల అప్పులు రాబోతున్నాయి అంటూ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిగా అమరావతి ఉండాలనే నిర్ణయం 2014 నుంచి 19 మధ్యలో జరిగింది. అప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు, భూసేకరణ కార్యక్రమాలు పూర్తి చేశారు.
ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది, రాజధాని నిర్మాణానికి కావలసిన లక్ష కోట్ల రూపాయల్ని ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రం భరించలేదు. కాబట్టి మూడు రాజధానులు చేస్తాం, అమరావతిని కేవలం శాసన రాజధానిగా ఉంచుతామంటూ ప్రకటించింది. రైతులను ఆదుకుంటామని ప్రకటించింది. రైతులకు ఇస్తున్న కౌలు, మిగతా బెనిఫిట్స్ అన్నీ అలాగే ఉంటాయని ప్రకటించింది. కానీ రాజధాని నిర్మాణం చేయకుండా మూడు రాజధానుల ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. మేము భూములు ఇచ్చాం మాకు న్యాయం చేయాల్సిందే కదా అంటూ వాళ్ళంతా ఆందోళన చేశారు. గడిచిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. రాజధాని తమ ప్రధానమైన అజెండా అని చెప్పింది రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని చెప్పింది. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించిన కూటమి సర్కారు దాదాపు 38వేల కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించిన టెండర్లు పిలిచింది. పనులు ప్రారంభమైనట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని పనులు ఇప్పటికే నడుస్తున్నాయి, 38వే కోట్ల రూపాయల నిధులలో ప్రపంచ బ్యాంకు నుంచి, ఏడిబి నుంచి, హడ్కో నుంచి కూడా రుణాలు సమీకరించారు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి చెప్పిన మాట, ప్రతి ఏట 15వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం, వచ్చే నాలుగేళ్లలో అమరావతి పూర్తి చేస్తాం, 60 వేల కోట్ల రూపాయలతో అమరావతిని పూర్తి చేస్తాం అంటూ చెప్పారు. ఇప్పటికే 38 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు, ఇంకా అప్పులు తెస్తున్నారు, తాజాగా మళ్ళీ 32వే కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నామంటూ ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి దాదాపుగా లక్ష కోట్ల రూపాయల రుణ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది. 93వేల కోట్ల రూపాయలు రుణ సమీకరణ ఇప్పటికే జరిగినట్టు చెప్తుంది. ఈరోజుకి మొదటి ఏడాది రాజధాని పనులు ప్రారంభించి, మొదటి ఏడాది కూడా గడవకముందే 93వే కోట్ల రూపాయల నిధుల సమీకరణ అంటే, వచ్చే నాలుగేళ్లలో ఎస్కలేషన్ పేరుతో , ఇంకో పేరుతో ఈ నిధులు ఈ అప్పులు మరింత పెరిగే ప్రమాదం కనపడుతుంది. రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేసేలా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి దిశగా తీసుకెళ్ళేలా ఉండాలి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకపోయేలా ఉంచకూడదు, పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, ఇప్పుడున్న ప్రాంతంలో 33వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తే అది ఒక మోడల్ మున్సిపాలిటీ గా అవుతుంది తప్ప రాజధాని నగరం కాదు, కాబట్టి అదనపు భూసేకరణ కూడా చేయాల్సిందే అని అంటున్నారు. ఈ అదనపు భూసేకరణ కూడా చేస్తే, ఆ అదనపు భూసేకరణ చేసిన ప్రాంతంలో కూడా మళ్ళీ నిర్మాణాలు చేయాల్సి వస్తే, డెవలప్మెంట్ చేయాల్సి వస్తే, అక్కడ ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందో తెలియని పరిస్థితి ఉంది.
రాజధాని నిర్మాణం అనేది ఒక తెల్ల ఏనుగులా గుదిబండల రాష్ట్రానికి మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. 33 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులకు దాదాపు లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తే, మరో 55వేల ఎకరాల భూసేకరణ చేస్తే, ఆ భూసేకరణ చేసిన సందర్భంగా అక్కడ రైతులకు ఇచ్చే కాంపెన్సేషన్ కావచ్చు, అందరూ ల్యాండ్ పూలింగ్ కి ఒప్పుకోకపోవచ్చు, అక్కడ డెవలప్మెంట్ కావచ్చు, రోడ్లు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఇంకా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందో ఊహించలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వమే చెప్తున్న లెక్కల ప్రకారం ఈ అమరావతి కోసం సేకరించిన నిధులు రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా 91,639 కోట్ల రూపాయలు అంచనాతో 112 పనులు మాత్రమే, 112 పనులకి 91వే కోట్ల రూపాయల అంచనాతో ఆ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ చేస్తుంది. వీటిలో ఇప్పటికే 87 పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు.53వేల కోట్ల రూపాయల విలువైన 87 పనుల ఇప్పటికే టెండర్లు పిలిచారు. రాజధాని-అప్పులపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!


