AP CM Chandrababu: పరదాలూ లేవు.. ప్రజలూ లేరు..!
AP CM Chandrababu: పరదాలూ లేవు.. ప్రజలూ లేరు..!
ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జిల్లాల పర్యటన చేస్తూన్నారు, రకరకాల పథకాలు ప్రారంభించిన సందర్భంగాను లేదా, ప్రతి నెల మొదటి తారీకు పెన్షన్ల పంపిణీ కోసమని ఆయన జిల్లాల పర్యటన చేస్తున్నారు, ఆయా జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా సామాన్యులతో ముఖ్యమంత్రి కలిసి మాట్లాడుతున్న వీడియోలని మనం కొన్ని చూస్తున్నాం. ఆయా గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు, అక్కడ చేతి వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారం చేసుకొని జీవిస్తున్న వాళ్ళను, నేరుగా చంద్రబాబు నాయుడు కలవడం, మాట్లాడడం వాళ్ళ సమస్యలని, అక్కడే పరిష్కారం చేయడం చూస్తూ ఉన్నాం. దానికంటే ముందు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఇంక ఎక్కడ కూడా, ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు, అక్కడ భారీ కేడ్లు ఉండవు, అక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా, నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడొచ్చు అని చెప్పారు, ఆ మేరకు ఇతర గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, ఎవరు అక్కడ లేకుండా ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే, అక్కడ గ్యాదర్ అయ్యేలా చేసి, వాళ్ళతో ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించడం చూశాం. సో ఆ తర్వాత క్రమంగా ఒక పిఆర్ ఈవెంట్ లాగా ముఖ్యమంత్రి పర్యటన కనబడుతుంది, ఏంటి పిఆర్ ఈవెంట్ అంటే, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటువంటి ఈవెంట్స్ చేయడం, పిఆర్ స్టంట్స్ చేయడం, చూస్తున్నాం, చూశాం. స్టంట్ అనే అంటాను నేను దాన్ని, పిఆర్ స్టంట్ గానే చూడాలి, సో పిఆర్ స్టంట్స్ గతంలో ప్రధాని మోదీ చేశారు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నట్లు కనపడుతుంది, సో గతంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరకు వెళ్ళాలంటే పరదాలు కట్టుకొని వెళ్ళేవాళ్ళు, పరదాలతో వెళ్ళాల్సిన పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చింది పరదాలు, లేకుండా రా చూద్దాం అంటూ జగన్మోహన్ రెడ్డి పైన అప్పుడు తెలుగు దేశం పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శలు చేయడం చూశాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా, అదే తరహాలో పరదాల ముఖ్యమంత్రి అంటూ ఆయనపైన, ఆయన పైన వ్యాఖ్యలు చేయడం విన్నాం. సో ఈ పరదాల ప్రస్తావన, పరదాల వ్యవహారం ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది అంటే, అమరావతిని మూడు రాజధానులుగా చేస్తాను, అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన తర్వాత రాజధాని ప్రాంతంలోనే ఉన్న అసెంబ్లీ కి వెళ్ళాలన్నా అక్కడన్న సెక్రటరిట్ కి వెళ్ళాలన్నా, సో ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేయాలన్నా, అక్కడ భూములు ఇచ్చిన 33 గ్రామాలకు సంబంధించిన రైతులు, మహిళలు ఆందోళన చేస్తూ ఉన్న నేపథ్యంలో, ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటన చేస్తున్నప్పుడు, అక్కడ ఆందోళనకారులు లేకపోతే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వాళ్ళలో, నిరసన తెలిపే అవకాశం ఉంటుంది, గ్రామాల ద్వారానే ముఖ్యమంత్రి పర్యటన చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి , చిన్న రోడ్లో అక్కడ ముఖ్యమంత్రి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి, ముఖ్యమంత్రి పర్యటనలో వేరే వాళ్ళు ఎవరూ అడ్డంకులు కల్పించకుండా ఉండడం కోసం పరదాలు ఏర్పాటు చేశారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!
